ఓటీటీకి వెళ్లిపోతే పుష్ప పట్టాలెక్కేదెలా?
స్టార్ డైరెక్టర్లు అంతా సినిమాల్ని పక్కన పెట్టి వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్నారు. ఇప్పట్లో మహమ్మారీ శాంతించే యోగం కనిపించడం లేదు. దీంతో సినిమాలు ఎలానూ థియేటర్లలోకి వచ్చే ఛాన్సే లేదు. అలాంటప్పుడు ఇంకా పెద్ద తెర అంటూ కలలు కనడం వృథా. సరిగ్గా ఇదే ఆలోచించి స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు. ఓటీటీ వేదికగా కలల పంట పండించుకునే ప్లాన్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ సహా సుకుమార్ ఈ తరహా ప్రణాళికల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొందరు నిర్మాతలుగా మారి శిష్యులకు డైరెక్టర్లుగా ఛాన్సులిస్తుంటే మరికొందరు తామే దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కథ- కంటెంట్ విషయంలో స్వయంగా ప్రతిదీ చూస్కుంటున్నారు.
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం చేస్తున్నది ఇదే. అతడు ప్రస్తుతం ఓవైపు `పుష్ప` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. పుష్ప చిత్రీకరణ మహమ్మారీ వల్ల వాయిదా పడింది. ఇటీవల గోదారి పరిసరాల్లోని మారేడుమిల్లి అడవుల్లో సెట్లు వేస్తున్నారని ప్రచారమైంది. షూటింగ్ వచ్చే రెండు నెలల్లో తిరిగి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈలోగానే ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.
సుకుమార్ ప్రస్తుతం సినిమాని పక్కన పెట్టి వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడన్నది తాజా లీక్. అతడు తెరకెక్కించే వెబ్ సిరీస్ తొమ్మిది విభిన్న ప్రేమ కథల కలయికతో సంకలనంగా ఉంటుందట. సుకుమార్ శిష్యులు ఈ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమార్ రైటింగ్స్ లో సుక్కూ స్క్రిప్టులు మాత్రమే ఇస్తున్నారా అన్నది ఆయనే చెప్పాల్సి ఉంది.