RRR డిలేతో ఆచార్య‌కు ముప్పు తిప్ప‌లు!

Update: 2020-06-23 05:45 GMT
సీక్వెన్సు.. కాన్ సీక్వెన్సు!  దీని మీనింగ్ ఏమిటో మ‌హ‌మ్మారీ స‌మ‌యంలో చాలా మందికి అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా అన‌వ‌స‌ర దూకుడు చూపించే వాళ్ల‌కు ముకుతాడు వేసింది ఈ సీజ‌న్. అలాగే సినీప‌రిశ్ర‌మ‌లో చాలా వ‌ర‌కూ క‌రెక్ష‌న్ ని తీసుకు వ‌స్తోంద‌ని న‌మ్ముతున్నారు. భారీ బ‌డ్జెట్లు కాస్ట్ ఫెయిల్యూర్ అన్న మాట ఇక‌పై ఇండ‌స్ట్రీలో ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే మ‌హ‌మ్మారీ ముప్పు వేరొక ర‌కంగానూ ఉంది.

త్వ‌ర‌త్వ‌ర‌గా పెండింగ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఆచార్య సెట్స్ లోకి జాయిన్ అయ్యేందుకు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే అత‌డి ఉత్సాహానికి మ‌హ‌మ్మారీ క‌ళ్లెం వేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ ని డిక్లేర్ చేయ‌లేదు. షూటింగ్ విష‌యంలో చ‌ర‌ణ్ స‌హా తార‌లంతా వేచి చూసే ధోర‌ణితోనే ఉండాల్సి వ‌స్తోంది.

ఓవైపు ప్ర‌ముఖ ఫార్మా కంపెనీలు మందు క‌నిపెట్టాం! అని ప్ర‌చారం చేస్తున్నా.. దేనికీ వైర‌స్ భ‌య‌ప‌డ‌డం లేదు. దానిప‌ని అది చేసుకుపోతోంది. ముఖ్యంగా మెట్రో న‌గ‌రం హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని న‌గ‌రాల్లోనూ క‌ల్లోలం సృష్టిస్తోంది. ప్ర‌స్తుతం ప‌ల్లె ప‌ల్లెల‌కూ విస్త‌రిస్తోంది. అన్నిచోట్లా హై టెన్ష‌న్ అలుముకుంది.

ఈ నేప‌థ్యంలో వెంట‌నే షూటింగులు చేద్దామంటే కుదిరే ప‌రిస్థితి లేదు. చాలా మంది స్టార్లు డిసెంబ‌ర్ వ‌ర‌కూ వేచి చూసే ధోర‌ణితో ఉండ‌డం కూడా ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ‌కు ఇబ్బందిక‌రంగానే మారింద‌ట‌. ప‌ర్య‌వ‌సానంగా ఇప్పుడు ఆచార్య షెడ్యూల్స్ కూడా డిస్ట్ర‌బ్ అవుతున్నాయి.

ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యితేనే చ‌ర‌ణ్ ఆచార్య షెడ్యూల్ లో జాయిన్ కాగ‌లడు. కానీ వైర‌స్ విజృంభ‌ణ‌తో అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది.ఇప్ప‌టికే మూడు నెల‌లు గంగ‌లో క‌లిసిపోయింది. ఇంకో మూడు నెల‌లు ఎదురు చూడాల్సిన సన్నివేశ‌మే క‌నిపిస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ స‌న్నివేశంలో ఎవ‌రైనా ఏం చేస్తారు? అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  ఆచార్య చిత్రంలో చ‌ర‌ణ్ రోల్ 20-40 నిమిషాల నిడివితో ఉంటుంద‌ని చెబుతున్నారు కాబ‌ట్టి చాలా వ‌ర‌కూ షెడ్యూల్స్ ని క‌వ‌ర్ చేయాల్సి ఉంటుంద‌ని భావిస్తున్నారు. మ‌రి కొర‌టాల‌కు ఈ చిక్కులేమిటో!
Tags:    

Similar News