చిరుతో రానా మల్టీస్టారర్ సినిమానా..పిల్లకాయకు అంత సీన్ ఉందా?

Update: 2020-05-10 01:30 GMT
టాలీవుడ్‌ లో ప్రస్తుతం రీమేక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్లు ఉన్నా లేకపోయినా హీరోలు అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఇలాంటి సినిమాలు చేయడానికి హీరోలు కూడా సిద్ధమైపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలను ఎక్కువగానే రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఈ మల్టీస్టారర్ల ట్రెండ్ కొత్తదేం కాదు. అప్పట్లో అన్నగారు సీనియర్ ఎన్టీఆర్-నాగేశ్వరరావులు, సూపర్ స్టార్ కృష్ణ- సోగ్గాడు శోభన్ బాబులు అనేక సినిమాలలో కలిసి నటించి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా అందరూ మల్టీస్టారర్ పరంపరను కొనసాగిస్తూ, ఇండస్ట్రీలో కొత్త మార్పులను తీసుకొస్తూ రికార్డులను తిరగరాశారు.

ఇక తాజాగా వెంకటేష్-నాగచైతన్యలు, నాగార్జున-నాని కూడా చేశారు. ఈ మధ్య ఓ మల్టీస్టారర్ సినిమా గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య జోరు పెంచి వరుస సినిమాలను లైన్ లో రెడీగా పెడుతున్నారు. లాక్ డౌన్ కాగానే అన్నింటిని పట్టాలెక్కిస్తారట. అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్న చిరు. ఆ తర్వాత లూసిఫెర్, మెహెర్ రమేష్ తో కొత్త సినిమాలో నటించనున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత చిరంజీవి డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కనుందట. మెగాస్టార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మరో పాత్రకోసం రానాను ఓకే చేస్తారని వినికిడి. అయితే ముల్టీస్టారర్ సినిమాలు చేయడం మెగాస్టార్ కి కొత్తేమి కాదు. గతంలో ఎన్నో ముల్టీస్టారర్ సినిమాలు చేసిన ఆయనకు రానాతో చేయడం కష్టమేమీ కాదనే విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ ముందు రానా సరితూగుతాడా అనేది ఆసక్తికర ప్రశ్న. అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Tags:    

Similar News