రజనీ అల్లుడు డబుల్‌ ధమాకా షురూ..

Update: 2015-08-25 10:00 GMT
రఘవరన్‌ బిటెక్‌ తో తెలుగు ప్రేక్షకుల్ని స్పెల్‌ బౌండ్‌ చేశాడు రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌. ఆ సినిమాకి ముందు, ఆ సినిమా తర్వాత అతడు నటించిన సినిమాలేవీ తెలుగులో విజయం సాధించలేదు. కోలీవుడ్‌ మార్కెట్‌ తో పాటు టాలీవుడ్‌ మార్కెట్ లోనూ దూసుకుపోవాలన్న అతడి కల నెరవేరలేదు. అలాగని వార్‌ ని వదిలిపెట్టేసేందుకు ధనుష్‌ సిద్ధంగా లేడు.

అటు హిందీలో టైమ్‌ చూసుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఒక్క రాంజానాతో స్టార్‌ అయిపోయాడక్కడ. ఇప్పుడు తమిళ్‌, హిందీ ద్విభాషా చిత్రాల్లో నటిస్తున్నాడు. అదే తరహాలో తమిళ్‌, తెలుగు ద్విభాషా చిత్రాల్లో నటించి మార్కెట్‌ రేంజ్‌ పెంచుకోవాలని ప్లాన్‌ వేస్తున్నాడు.

ప్రస్తుతం కోలీవుడ్‌ లో ఓ రెండు సినిమాలు లైన్‌ లో ఉన్నాయి. అందులో ప్రభు సాల్మన్‌ సినిమా ఆన్‌ సెట్స్‌ ఉంది. దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ అక్టోబర్‌ లో సెట్స్‌ కెళ్లనుంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ధనుష్‌ కెరీర్‌ లో ఒకే ఫ్రేములో రెండు పాత్రల్లో కనిపించడం ఇదే తొలిసారి. అన్నదమ్ములుగా మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందనడంలో సందేహమే లేదు.
Tags:    

Similar News