ఆమె మాటలతో మళ్లీ బాలీవుడ్‌ రామయణ్‌ చర్చ

Update: 2020-05-09 11:50 GMT
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా బుల్లి తెరపై ప్రసారం కావాల్సిన సీరియల్స్‌ మరియు రియాల్టీ షోలు ఆగిపోయాయి. దాంతో పలు ఛానెల్స్‌ పాత సీరియల్స్‌ను ప్రసారం చేశాయి. దూరదర్శిన్‌ కూడా 1980 కాలం నాటి రామాయణ్‌ను రీ టెలికాస్ట్‌ చేసింది. ఆ సీరియల్‌ ఇప్పుడు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ ను దక్కించుకుంది. దాంతో రామాయణ్‌ కోసం ప్రేక్షకులు ఎంతగా మొహం వాచి ఉన్నారో అర్థం అయ్యింది. అందుకే వెండి తెరపై రామాయణంను తీసుకు రావాలంటూ చాలా మంది కోరుకుంటున్నారు.

అప్పటి రామాయణ్‌ సీరియల్‌ లో సీత పాత్ర పోషించిన దీపిక చిఖలియా తాజాగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమె సినిమాగా రామాయణం రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. ఒక వేళ రామాయణ్‌ సినిమా తీస్తే రాముడిగా హృతిక్‌ రోషన్‌ బాగుంటాడు. ఆలియా భట్‌ సీత పాత్రలో నటించాలని కోరుకుంది. ఇక రావణుడిగా అజయ్‌ దేవగన్‌ అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

రామయణంలోని కీలకమైన లక్ష్మణుడి పాత్రను వరుణ్‌ దావన్‌ చేస్తే బాగుంటుందని చెప్పింది. దీపిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. చాలా కాలంగా హిందీ రామాయణ్‌ గురించి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి అయినా బాలీవుడ్‌ రామాయణ్‌ ను మొదలు పెట్టాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో పౌరాణికం అంటే మామూలు విషయం కాదు. అందుకే మేకర్స్‌ ఆలోచిస్తున్నారు. కాని ఇప్పుడు కాకున్నా రాబోయే అయిదు పదేళ్లలో అయినా కూడా రామాయణ్‌ వెండి తెరపై ఆవిష్కరించబడటం ఖాయం అంటున్నారు.
Tags:    

Similar News