• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2020లో అడుగు పెట్టే ముందు...

2020లో అడుగు పెట్టే ముందు హుషారేదీ?

By - Tupaki Desk
Update: 2019-12-07 17:30 GMT
డిసెంబ‌ర్ అంటే క్రిస్మ‌స్ కీల‌కం. అంత‌కుముందు అటూ ఇటూ సినిమాలేవైనా రిలీజైనా హైప్ క‌నిపించ‌దు ఎందుక‌నో. ఈనెల‌ తొలి శుక్ర‌వారం వ‌చ్చిన సినిమాలు స‌గ‌టు ప్రేక్ష‌కుడిని అంత‌గా సంతృప్తిప‌ర‌చ‌లేక‌పోయాయి. డిసెంబ‌ర్ 6న కార్తికేయ `90 ఎం.ఎల్‌`.. ఐశ్వ‌ర్యారాజేష్ న‌టించిన `మిస్‌ మ్యాచ్‌`.. శ్రీ‌నివాస‌రెడ్డి తొలి సారి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు`.. కొత్తోళ్ల‌తో `మ‌థ‌నం` ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డంలో త‌డ‌బ‌డ్డాయి. నాలుగు రిలీజైతే క‌నీసం ఒక్క‌టి అయినా ఆశించిన స్థాయిని రీచ్ కాలేక‌పోయాయి.

`ఆర్.ఎక్స్ 100` ఫేమ్ కార్తికేయ న‌టించిన `90 ఎం.ఎల్‌` చిత్రానికి రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయినా ఆశించిన స్థాయిలో క‌థ‌ క‌థ‌నాలు లేక‌పోవ‌డం ప్ర‌ధాన డ్రాబ్యాక్‌గా మారింది. డేలో మూడు పెగ్గులు ప‌డ‌క‌పోతే చ‌నిపోతాడ‌నే సిండ్రోమ్ వున్న హీరో క‌థ‌తో వ‌చ్చిన ఈ చిత్రం అంత‌గా కిక్ నివ్వ‌లేక‌పోయింది. సినిమా చూసి థియేట‌ర్ నుంచి బ‌య‌టకు వ‌స్తున్న ప్రేక్ష‌కులు మీడియా ముందు పెద‌వి విరిచేయ‌డం క‌నిపిస్తోంది. ఇక క‌మెడియ‌న్ శ్రీ‌నివాస‌రెడ్డి తొలిసారి ద‌ర్శ‌కుడిగా మారి న‌టించి రూపొందించిన చిత్రం `భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ సినిమాలో కామెడీ వున్నా స‌రైన ఎగ్జిక్యూష‌న్ కొర‌వ‌డింది. ఫ‌స్ట్ హాఫ్ పూర్త‌య్యే స‌రికే ప్రేక్ష‌కులు స‌హ‌నం కోల్పోయారు. క్లైమాక్స్ ఏమైనా వుందా అంటే అదీ లేదు.  

ఉద‌య్ శంక‌ర్‌- ఐశ్వ‌ర్యారాజేష్‌ల `మిస్‌మ్యాచ్‌` టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కంటెంట్ లో ప‌స లేక‌పోవ‌డంతో టైటిల్ కు త‌గ్గ‌ట్టే మిస్ మ్యాచ్ అనిపించుకుంది. శ్రీ‌నివాస‌సాయి న‌టించిన `మ‌థ‌నం` ఇండియాలో రిలీజ్ కాలేదు. కేవ‌లం అమెరికాలోనే రిలీజ్ అయింది. అక్క‌డ ఎవ‌రినీ ఆక‌ట్టుకోలేదు. దీంతో   నెక్ట్స్ వీక్ సంగ‌తేంటి? అన్న చ‌ర్చా మొద‌లైంది. ఇక డిసెంబ‌ర్ 13న రెండో శుక్ర‌వారం సీనేంటో? ఇప్ప‌టికే `వెంకీ మామ‌`కు లైన్ క్లియ‌ర్ అయింది. సోలోగా వ‌స్తున్న `వెంకీమామ‌` బాగుంది అన్న టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వ‌ద్ద హుషారొస్తుంది. ఆ త‌ర్వాతి వారంలో ద‌బాంగ్ 3 .. రూల‌ర్.. ప్ర‌తిరోజు పండ‌గే చిత్రాల‌పై అంతో ఇంతో అంచ‌నాలున్నాయి కాబ‌ట్టి అప్ప‌టివ‌ర‌కూ వెంకీమామ‌నే క‌థ న‌డిపించాల్సి ఉంటుంది మ‌రి.


Tags:    
  • December First Week 
  • Box Office 
  • TElugu NEws 

Similar News

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

Copyright @2026

Powered by Blink CMS