దర్జా టీజర్ టాక్‌ : చీర కట్టిన శివంగి వేటాడితే..!

Update: 2022-03-30 15:49 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ గా హీరోయిన్ రేంజ్ గుర్తింపు దక్కించుకున్న అనసూయ మెల్ల మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా బుల్లి తెరతో పాటు వెండి తెరపై కూడా స్టార్‌ గా మారిపోయింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తో ప్రతి ఒక్కరిని కూడా అబ్బురపర్చిన అనసూయ ఇటీవల అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఒక వైపు స్టార్‌ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మరో వైపు తాను లీడ్ రోల్‌ చేస్తూ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు దర్జా అనే సినిమాలో నటించింది. సినిమాలో అనసూయ లీడ్ రోల్‌.. అయితే ఆమె నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర కావడం విశేషం. ఒక గ్యాంగ్ స్టర్ నాయకురాలిగా అనసూయ ఈ సినిమాలో కనిపించబోతుంది. తనకు ఎదురు వచ్చింది ఎంతటి వారైనా తొక్కుకుంటూ వెళ్లే పాత్రలో అనసూయ కనిపిస్తుంది.

కనకమహాలక్ష్మి పాత్రలో అనసూయ ఈ సినిమాలో కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ ను సురేష్ బాబు చేతుల విడుదల చేయించారు. టీజర్‌ లో అనసూయ లుక్ మరియు సన్నివేశాలను చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతోంది. కనకమహాలక్ష్మి యొక్క అక్రమ సామ్రాజ్యం లోకి పోలీసు అయిన సునీల్‌ ఎంట్రీ ఇస్తాడు. ఆ పోలీస్ ను అనసూయ ఎలా ఎదిరించింది అనేది ఈ సినిమాలో చూడబోతున్నట్లుగా టీజర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

ఎవరైనా ఈ కనకాన్ని టచ్‌ చేసేందుకు ట్రై చేశారా బందల కోట బద్దలైపోద్ది.... కాలినప్పుడు కుర్చీలు గట్రా వేయకూడదురా ఖాకీ... నేను చీర కట్టిన శివంగిని రా నేను వేటాడితే ఎలా ఉంటదో వాడికి తెలియాలి అంటూ అనసూయ చెప్పిన డైలాగ్స్ అదరహో అన్నట్లుగా ఉన్నాయి. అంతే కాకుండా ఆమె లుక్ చాలా పవర్‌ ఫుల్‌ గా అలాగే అందంగా కూడా ఉంది.

అందంతో పాటు పొగరు కలగలిసిన కనకమహాలక్ష్మి నిజంగానే శివంగి తరహాలో రెచ్చి పోంది. ఈ సినిమాతో అనసూయ ఖచ్చితంగా ఒక మంచి కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఈ సినిమా కు సలీమ్‌ మాలిక్ దర్శకత్వం వహించగా రాప్‌ రాక్ షకీల్‌ సంగీతాన్ని అందించాడు. పీఎస్‌ఎస్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో శివ శంకర్ పైడిపాటి నిర్మించారు.

Full View
Tags:    

Similar News