స‌న్నీ గుట్టు విప్పేసిన హ‌బ్బీ.. ఇది త‌గునా?

Update: 2020-04-21 04:30 GMT
``మా ఆవిడ బ‌ద్ధ‌కిష్ఠి. కానీ బాగా వండుతుంది. రోజంతా బద్ధ‌కంగా గ‌డిపేస్తుంది.. బాగా నిద్ర పోతుంది! ఇలా ఎవ‌రైనా చెబుతారా?`` ఒకే ఒక్క పాజిటివ్ మ్యాట‌ర్ ఉన్నా.. అన్నీ నెగెటివే క‌దా! కానీ ఆయ‌న మాత్రం త‌న భార్యామ‌ణి వాల‌కం గురించి ఇలానే చెప్పాడు. ఇంత‌కీ ఎవ‌రు ఆ భ‌ర్త? ఏమిటా భార్యమ‌ణి క‌థ‌‌? అంటే.. స‌న్నీలియోన్- డేనియ‌ల్ వెబర్ జంట గురించే ఇదంతా. స‌న్నీ ఒక పోర్న్ స్టార్ అని తెలిసీ అత‌డు త‌న‌ను పెళ్లాడాడు. స‌న్నీ జీవితంలో భాగం అయ్యాడు. స‌రోగ‌సీలో పిల్ల‌ల్ని క‌న‌డం ద‌గ్గ‌ర నుంచి సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీని ప్రారంభించ‌డం వ‌ర‌కూ అన్నిటా అత‌డు భాగ‌స్వామి. అన్యోన్య దాంప‌త్యం అనేస్తే స‌రిపోదు.. ప్రేమైక జీవ‌నం అంటే ఏమిటో ఈ జంట లోకానికి చాటి చెబుతున్నారు. ఒక‌ర‌కంగా ఈ జోడీకి హ్యాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేరు స‌గ‌టు భ‌ర్త‌లు.

ప్ర‌స్తుతం క్వారంటైన్ టైమ్ ని స‌న్నీ- వెబ‌ర్ జంట ఓ రేంజులో ఆస్వాధిస్తున్నారు. ముంబైలోని అపార్ట్ మెంట్ నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఖాళీ స‌మ‌యాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆ ఇద్ద‌రి మ‌ధ్యా బోలెడంత రొమాన్స్ .. ఫ‌న్ ఎలివేట్ అవుతోంది. డేనియ‌ల్ వెబ‌ర్ త‌న భార్యామ‌ణి గుట్టు మ‌ట్లు అన్నీ ఫ్ల‌కార్డుల రూపంలో బ‌య‌ట పెట్టేశాడు డేనియ‌ల్. ఇక లాక్ డౌన్ స‌మ‌యంలో స‌న్నీలియోన్ సామాజిక మాధ్య‌మాల ద్వారా త‌న స్నేహితులైన స్టార్ల‌కు అలాగే అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

స్టార్ల‌తో ర‌క‌ర‌కాల ఫ‌న్నీ వీడియోల్ని రిలీజ్ చేస్తోంది. వీట‌న్నిటికీ ఆద‌ర‌ణ బావుంది. ఇక బాలీవుడ్ లో స్టార్లంతా ర‌క‌ర‌కాలుగా టైమ్ స్పెండ్ చేస్తుంటే స‌న్నీ- డేనియ‌ల్ జంట మాత్రం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తూ ఇంట్రెస్టింగ్ వీడియోల‌ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. ఇవి సాటి స్టార్ల‌కు చేరువ అవుతున్నాయి. తాజా ఫ‌న్నీ వీడియో నెట్ లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతోంది. ఇక బేబి డాళ్ స‌న్నీలియోన్ ఇటీవ‌ల సౌంద‌ర్య ఉత్ప‌త్తుల కంపెనీని ప్రారంభించిన త‌ర్వాత సినిమాల ప‌రంగా నెమ్మ‌దించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా స‌న్నీ అన్నిటినీ ప‌క్క‌న పెట్టేసి పూర్తిగా ఇంటికే అంకిత‌మైంది.
Tags:    

Similar News