టాలీవుడ్ లో `వ‌డ్డీ` నిషేధంపై ప్ర‌భుత్వ జోక్యం?

Update: 2020-05-04 06:00 GMT
క‌రోనా లాక్ డౌన్ ప్ర‌పంచ దేశాల‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తోందో చూస్తున్న‌దే. దీని ప్ర‌భావం సినీప‌రిశ్ర‌మ‌ల‌పై తీవ్రంగా ప‌డింది. లాక్ డౌన్ ఎత్తేసేది ఎపుడో క్లారిటీ లేకుండా పోయింది. క‌రోనా ఇప్ప‌ట్లో పోయేది కాదు. దాంతోనే స‌హ‌జీవ‌నం చేయాల‌ని .. వ్యాక్సినేష‌న్ కోసం ఏడాది పాటు వేచి చూడాల‌ని నిపుణులు నాయ‌కులు కూడా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేస్తుండ‌డం తో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి ఉంది. అయితే ఇలాంటి క‌ష్ట కాలాన్ని త‌ట్టుకుని టాలీవుడ్ నిల‌బ‌డ‌డ‌మెలా? అంటే దీనిపై స‌రైన క్లారిటీ రాలేదింకా.

ఇప్ప‌టికే థియేటర్లు బంద్ కొన‌సాగుతోంది. దాంతో పాటే షూటింగుల్లేవు. దీంతో కార్మికులు తిండికి లేక అల్లాడుతున్నారు. అదొక్క‌టేనా క‌రోనా త‌గ్గే వ‌ర‌కూ విలేజ్ ల‌కు వెళ్లిపోయి ఇక తిరిగి రాకూడ‌ద‌న్న క‌ఠిన నిర్ణ‌యాల్ని అమ‌లు చేస్తున్నారు కార్మిక జ‌నం. ఈ ప‌ర్య‌వ‌సానం ఇప్ప‌టికే సెట్స్ పై ఉన్న సినిమాల‌పై తీవ్రంగా ప‌డ‌నుంది. ఇక‌పోతే లాక్ డౌన్ ని ఎత్తేయ‌కుండా పొడిగిస్తూ  పోతుంటే నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఇప్ప‌టికే చాలా సినిమాలు స‌గం చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేసుకుని లేదా క్లైమాక్స్ కి వ‌చ్చి ఆగిపోయి ఉన్నాయి. ఆ మేర‌కు ఫైనాన్షియ‌ర్ల నుంచి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి? అన్న బెంగ నిర్మాత‌ల్ని నిలువ‌నీయ‌డం లేదు. ఆ క్ర‌మంలోనే అప్పుల‌పై వ‌డ్డీలు అద‌న‌పు భారంగా మారుతుంటే బెంబేలెత్తే ప‌రిస్థితి ఉంది.

అయితే `అస‌లు` మాత్ర‌మే తీర్చాలా లేక `వ‌డ్డీ` క‌లుపుకుని అప్పు మొత్తం తీర్చాలా? అన్న గంద‌ర‌గోళం నెల‌కొంది. కొంద‌రు నిర్మాత‌లు అయితే లాక్ డౌన్ ప‌ర్య‌వ‌సానాన్ని ఫైనాన్షియ‌ర్ల‌కు వివ‌రించి వ‌డ్డీ ఇవ్వ‌లేమ‌ని కూడా చెప్పేస్తున్నార‌ట‌. ఏదోలా క‌న్విన్స్ చేసి లాక్ డౌన్ పీరియ‌డ్ వ‌రకూ వ‌డ్డీ చెల్లించ‌లేమ‌ని ప్రాధేయ‌ప‌డుతున్నార‌ట‌. ఇలాంటి ప‌రిస్థితి ఎన్న‌డూ చూడ‌నిది. ఊహించ‌నిది కావ‌డంతో ఇటు ఫైనాన్షియ‌ర్లు సైతం దీనిపై యోచ‌న‌లో ప‌డే ప‌రిస్థితి ఉంది. అర్థం చేసుకుని కొన్నిటికి స‌డ‌లింపులు ఇవ్వ‌క‌పోతే ఇక్క‌డ ఎవ‌రూ నిల‌బ‌డ‌లేరు. ఫ‌లితంగా ప‌రిశ్ర‌మ‌నే మూసేయాల్సొస్తుంది. అలా కాకుండా తాజా స‌న్నివేశానికి త‌గ్గ‌ట్టు మాన‌వ‌త‌ను చూపించాల్సి ఉంటుంది. మ‌రోవైపు హీరోలు కూడా పారితోషికాల్ని భారీగా త‌గ్గించుకుని సినిమాలు స‌వ్యంగా రిలీజ‌య్యేందుకు నిర్మాత న‌ష్ట‌పోకుండా ఉండేందుకు ఏదో ఒక‌టి చేయాల్సి ఉంటుంది.

అయితే ఇవ‌న్నీ స‌వ్యంగా జ‌ర‌గాలంటే నిర్మాత‌ల మండ‌లి- ఫిలింఛాంబ‌ర్ - ఫెడ‌రేష‌న్ స‌హా అన్ని శాఖ‌ల పెద్ద‌లు స‌మావేశ‌మై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌త్యేకించి క‌రోనా క్రైసిస్ పై అధ్య‌య‌నం చేసి ఒక కొత్త ఫార్ములాని త‌యారు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్ర‌మే ప‌రిశ్ర‌మ‌ను బ‌తికించుకోగ‌ల‌రు. లాక్ డౌన్ వ‌ల్ల వేలాది కార్మికులు విలేజ్ ల‌కు వెళ్లిపోయి ప‌నికి రాక‌పోతే ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌లు మిడిల్ లో ఉన్న సినిమాల ప‌రిస్థితేమిటి?  అలాగే లాక్ డౌన్ కొన‌సాగిస్తే టాలీవుడ్ కి న‌ష్టం ఎంత అన్న‌ది ప్ర‌భుత్వం త‌ర‌పున‌ రివ్యూ చేసేందుకు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని ఈ మంగ‌ళ‌వారం నాడు సినీపెద్ద‌ల‌తో స‌మావేశ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల్ని బ‌తికించేందుకు కొత్త పాల‌సీ ఏదైనా ప్ర‌క‌టిస్తారేమో చూడాలి. లాక్ డౌన్ మూడు నెల‌లు తెలంగాణ‌లో అద్దెలు కట్టాల్సిన ప‌ని లేద‌ని తెరాస ప్ర‌భుత్వం రూల్ పాస్ చేసిన‌ట్టే.. సినీరంగంలో ఫైనాన్స్ తెచ్చిన వారు వ‌డ్డీలు క‌ట్ట‌న‌క్క‌ర్లేద‌ని ఏదైనా సెల‌విస్తారేమో చూడాలి.
Tags:    

Similar News