పెద్ద సినిమాలు కొన్ని నెలల పాటు ఆగాల్సిందే

Update: 2020-04-28 06:50 GMT
దేశంలో మే 3 తర్వాత లాక్‌ డౌన్‌ కొనసాగించినా.. ఎత్తి వేసినా కూడా సినిమా ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితి వెంటనే మునుపటి స్థితిలోకి రావడం అసాధ్యం అంటున్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు పలు ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌ మరియు థియేటర్లకు ఆంక్షలు వర్తింపజేస్తారు. పదుల సంఖ్యలో జనాలు గుమ్మిగూడకుండా చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా కూడా వేడుకలను రద్దు చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కనుక సినిమాల నిర్మాణం ప్రారంభంకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందనిపిస్తుంది.

ముఖ్యంగా పెద్ద సినిమాల షూటింగ్స్‌ కు కాస్ట్‌ అండ్‌ క్రూ వందల సంఖ్యలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి భారీ చిత్రం షూటింగ్‌ కు వందలాది మంది జూనియర్‌ ఆర్టిస్టులు.. టెక్నీషియన్స్‌.. డైరెక్షన్‌ టీం.. నటీనటుల సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఉంటారు. కనుక అలాంటి పెద్ద సినిమాల షూటింగ్స్‌ కు అనుమతి ఇవ్వకుండా చిన్న చిన్న సినిమాలకు సీరియల్స్‌ లేదా వెబ్‌ సిరీస్‌ ల షూటింగ్స్‌ కు అనుమతి ఇస్తే బాగుంటుందని సినీ వర్గాల వారే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద సినిమాల నిర్మాణం మళ్లీ ప్రారంభం అయ్యేందుకు నెలల సమయం పట్టినా కూడా పది ఇరవై మంది కలిసి షూటింగ్‌ చేసే సీరియల్స్‌ వెబ్‌ సిరీస్‌ సినిమాల షూటింగ్స్‌ కు లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత కొన్ని వారాలకే అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒక వేళ అనుమతులు ఉన్నా కూడా పెద్ద సినిమాల షూటింగ్‌ కనీసం నాలుగు అయిదు నెలల తర్వాతే పెట్టుకోవడం మంచిది అనిపిస్తుంది. స్టార్‌ హీరోల సినిమాలు ఏవీ కూడా ఈమద్య ప్రారంభం కావడం కాని.. ఈ ఏడాది విడుదల అవ్వడం కాని జరిగేలా లేదు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకు సినిమా పరిశ్రమలో మునుపటి జోరు కనిపించదు.
Tags:    

Similar News