బాహుబలి ఫస్ట్‌టాక్; ఫస్ట్‌హాఫ్‌లో పంటి కింద ఇసుక..!
అద్భుతమైన వంట వండినా అందులో చిటికెడు ఉప్పు తగ్గినా.. కాస్తంత కారం తగ్గినా.. ఆ కొరత కొరతే. వీటన్నింటికి మించి.. ఆహారంలో ఇసుక కలిస్తే చికాకు పుట్టటం ఖాయం. ఉప్పు.. కారం కాస్త తగ్గితే సర్దుకుపోవచ్చు కానీ.. పంటి కింద ఇసుక తగిలితే మాత్రం చిరాకు పుట్టటంతో పాటు.. అసహనం కలుగుతుంది. వండేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం ఉండదా? అన్న ప్రశ్న వినిపించటం ఖాయం.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఫస్ట్‌హాఫ్‌కు సంబంధించి కాస్తంత నిరాశ కలిగించే అంశాలు ఒకట్రెండు ఉండటం గమనార్హం. మరీ.. రంధ్రాన్వేషణ చేసినట్లు కాదు కానీ.. ఫస్ట్‌హాఫ్‌లో సీరియస్‌గా సాగే సినిమాలో లవ్‌ట్రాక్ కరెక్ట్‌గా కూర్చోలేదన్న భావన పలువురు వ్యక్తం చేస్తున్నారు. సీరియస్‌గా సాగే సినిమాలో మధ్యలో లవ్‌ట్రాక్ రావటంతో.. ఊపు కాస్త తగ్గిందన్న భావన వినిపిస్తుంది.
ఇక.. ఫస్ట్‌హాఫ్ విషయానికి వస్తే.. లవ్ ట్రాక్ కాస్త పలుచన చేసింది. ఇక.. హాస్యం అన్నది సినిమాలో మచ్చుకు కూడా కనిపించని పరిస్థితి. ఇలాంటి సినిమాల్లో హాస్యం లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకున్నా.. అలాంటివి కొన్ని రాసి పెట్టుకొని ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. ఈ రెండు విషయాల్లో మాత్రం ప్రేక్షకుడ నిరాశ చెందటం ఖాయం. దీంతో పాటు.. ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుష్క విషయంలో ఫస్ట్‌హాఫ్‌లో చాలా దారుణంగా చూపించారు. అయితే.. ఫ్లాష్‌బాక్‌లో కనిపించే అనుష్క మాత్రం అరుంధతి సినిమాలో కనిపించిన దాని కంటే రెట్టింపు గ్రేస్‌లుక్‌తో కనిపించిందన్న భావన కలుగుతుంది.