ప్లీజ్ అలా పెట్టకండి : శేఖర్ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు ఆయన శిష్యుల గురించి... ఆయన చనిపోవడానికి ముందు రోజుల్లో కలిసిన వారు.. పట్టించుకోని వారి గురించి ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో నానా రచ్చ చేస్తూ హడావుడి చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్.. అంతే కాకుండా సత్య మాస్టర్ లు ఇద్దురు కూడా రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యులు అనే విషయం తెల్సిందే. వారిద్దరు కూడా రాకేష్ మాస్టర్ ను చివరి రోజుల్లో పట్టించుకోలేదు అంటూ యూట్యూబ్ ఛానల్స్ ఇష్టానుసారంగా థంమ్‌నైల్స్ పెట్టి ప్రచారం చేస్తున్నాయి.
ఆ యూట్యూబ్ ఛానల్స్ కథనాలపై శేఖర్ మాస్టర్ స్పందించాడు. దయచేసి రాకేష్ మాస్టర్ చావు గురించి.. ఇతర విషయాల గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు అల్లేసి థమ్ నైల్స్ పెట్టవద్దని విజ్ఞప్తి చేశాడు. అంతే కాకుండా తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో రాకేష్ మాస్టర్ ఒకరు అంటూ మరోసారి శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
ప్రభుదేవా స్ఫూర్తితో ఇండస్ట్రీ లో అడుగు పెట్టాను కానీ నాకు డాన్స్ నేర్పించి.. ఆశ్రయం ఇచ్చింది మాత్రం రాకేష్ మాస్టర్ అని... తన జీవితాంతం ఆయన శిష్యుడిగానే పిలిపించుకునేందుకు గర్వపడుతాను అన్నట్లుగా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.
రాకేష్ మాస్టర్ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కథనాలు రాస్తే ఊరుకునేది లేదు అంటూ శేఖర్ మాస్టర్ మీడియా వారిని ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వారికి విజ్ఞప్తి చేస్తూనే హెచ్చరించాడు.