తాత కాబోతున్న స్టార్ హీరో
తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఇటీవలే హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే నటుడిగా తనయుడు మంచి గుర్తింపు దక్కించుకోవడంతో విక్రమ్ చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం కొడుకుతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నాడు. ధృవ్ హీరోగా రూపొందబోతున్న రెండవ సినిమాలో విక్రమ్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సమయంలోనే విక్రమ్ మరో గుడ్ న్యూస్ ను అందుకున్నాడు.
విక్రమ్ కూతురు అక్షితకు 2017లో మను రంజిత్ తో వివాహం జరిగింది. ఆమె వైవాహిక జీవితంలో మరో కీలక మలుపుగా ఆమె గర్బం దాల్చింది. అక్షిత ప్రెగ్నెంట్ అనే విషయం ప్రస్తుతం విక్రమ్ కుటుంబంలో సంతోషాన్ని నింపింది. ఈ సందర్బంను పెద్ద పార్టీతో సెలబ్రేట్ చేసుకోవాలని భావించినా ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
కొడుకు ధృవ్ హీరో అయిన ఆనందంతో ఉన్న విక్రమ్ కు ఇప్పుడు తాత కాబోతుండటంతో ఆ ఆనందం మరింతగా పెరిగింది. తాత కాబోతున్న విక్రమ్ త్వరలోనే ఇండస్ట్రీలోని సన్నిహితులకు పార్టీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడట. మరికొన్ని నెలల్లో విక్రమ్ తన మనవడు లేదా మనుమరాలితో ఆడుకునే అవకాశం ఉంది.