#చిరు నెక్ట్స్.. వినాయక్ కి రీప్లేస్ చేస్తున్నారా?
మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ పీరియడ్ ని సద్వినియోగం చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి- రామ్ చరణ్ మల్టీస్టారర్ ఆచార్య కు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు టీమ్ సంసిద్ధంగా ఉంది.
ఈ సినిమాతో పాటు వరుసగా మూడు నాలుగు రీమేక్ కథల్ని మెగాస్టార్ లాక్ చేసారు. వేదాళం రీమేక్ కి మెహర్ రమేష్ ని ఖాయం చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమేక్ దర్శకుడిని ఫైనల్ చేశారని తెలుస్తోంది.
అయితే అంతా ఊహించినట్టుగా వీవీ వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం లేదని తెలుస్తోంది. వినాయక్ స్థానంలో ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. ధృవ ఫేం మోహన్ రాజాతో వినాయక్ స్థానాన్ని రీప్లేస్ చేస్తున్నారన్న గుసగుసలు ఇండస్ట్రీలో వేడెక్కిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గత కొంతకాలంగా వినాయక్ స్క్రిప్టు పనుల్లో ఉన్నారు. అయితే ఇందులో కామెడీ షేపప్ అయిన తీరు మెగాస్టార్ కి నచ్చలేదని అందుకే ఇప్పుడు మోహన్ రాజాతో రీప్లేస్ చేస్తున్నారని ప్రచారమవుతోంది.
నిజానికి సాహో దర్శకుడు సుజీత్ స్థానంలోకి వినాయక్ వచ్చారు. కానీ ఆ ఇద్దరూ స్క్రిప్టు పరంగా చిరుని మెప్పించలేకపోయారన్న కథనాలు వేడెక్కిస్తున్నాయి. అయితే ఇటీవల వినాయక్ అన్నయ్యతో సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. చిరు రీఎంట్రీ మూవీ ఖైదీనంబర్ 150కి వినాయక్ దర్శకత్వం వహించగా అది ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వినాయక్ కెరీర్ ఒడిదుడుకులు అందరికీ తెలిసినదే. మరి తాజా కథనాల్లో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంటుంది.