అల్లు అబ్బాయి కోసం మెగాస్టార్ వస్తున్నారు

Update: 2016-07-27 05:23 GMT
అల్లు శిరీష్ ఇప్పటికి ఇండస్ట్రీలో రెండు ప్రయత్నాలు చేశాడు కానీ.. అవి సక్సెస్ కాలేదు. కానీ ఈ సారి మాత్రం శ్రీరస్తు శుభమస్తు అంటూ స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాడు. ఫ్యామిలీలను మెప్పించే టార్గెట్ తో కామెడీ పండిస్తూ సినిమా చేసేశాడీ హీరో. రీసెంట్ గా రిలీజ్ అయిన శ్రీరస్తు.. శుభమస్తు ట్రైలర్ కి అటు ఇండస్ట్రీ జనాల నుంచి ఇటు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి ఈ నెల 31న ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. హైద్రాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని తెలుస్తోంది. తన వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోల సినిమా కార్యక్రమాలకు వచ్చి ఆశీర్వదించడం మెగాస్టార్ కి ఆనవాయితీ. దీన్ని అల్లు శిరీష్ విషయంలోనూ కంటిన్యూ చేయాలని నిర్ణయించారట చిరంజీవి.

ఆగస్ట్ 5న విడుదల కానున్న శ్రీరస్తు శుభమస్తుకి... ట్రైలర్ లో అయితే హీరో హీరోయిన్స్ ఇద్దరూ ఆకట్టుకుంటున్నారు. మరీ మెచ్యూర్డ్ యాక్టర్స్ అనిపించేయకపోయినా.. గత చిత్రాలతో పోల్చితే యాక్టింగ్ లో బోలెడంత ఇంప్రూవ్మెంట్ చూపించేశారు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా పండడం ఈ మూవీకి కలిసొచ్చే విషయంగా చెప్పచ్చు.

Tags:    

Similar News