అటు చిరంజీవి.. ఇటు పవన్ స్పెషల్ ట్వీట్స్
కొత్త సంవత్సరం వేళ.. మెగా స్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తినిచ్చే ట్వీట్లతో ఆకట్టుకున్నారు. వీళ్లిద్దరూ చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వీరత్వంపై స్పందించగా.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్లు చేశారు.
ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా.. పవర్ స్టార్ పవన్ ‘వకీల్ సాబ్’గా వస్తున్నాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా పవన్ కళ్యాన్ నుంచి సర్ ప్రైజ్ వచ్చింది. శృతి హాసన్ తో కలిసి ఉన్న పోస్టర్ ను తాజాగా వకీల్ సాబ్ యూనిట్ విడుదల చేసి నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు.
ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘ఈ కొత్త సంవత్సరం, మన జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని కోరుకుంటూ, అందరికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు. ‘ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ పుణ్యం క్షీణిస్తుంది.. ఎక్కడ వీరత్వం ఉండదో, అక్కడ స్వార్థం జయిస్తుంది' అంటూ శ్రీ రాంధారి సింగ్ కవితలోని లైన్లను పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘థ్యాంక్యూ 2020. మాకు ఓర్పును నేర్పావు. మా జీవితాలను మార్చావు.. ప్రకృతి ఎంత విలువైందో నేర్పావు. వెల్ కమ్ టు ది న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అయినా బాగుండాలి.. బోలెడంత సంతోషాన్ని ఇవ్వాలి. మీ కలలన్నీ నిజం కావాలి.. కోవిడ్ వ్యాక్సిన్ కూడా రావాలి. విష్ యూ ఏ వేరీ హ్యాప్సీ హెల్తీ అండ్ ఫుల్ ఫిల్లింగ్ న్యూ ఇయర్ అని అందులో ఎమోషనల్ ట్వీట్ చేశారు.