చరణ్ డ్యాన్స్ గురించి చిరు టెన్షన్..

Update: 2017-11-19 04:13 GMT
తెలుగులో ప్రస్తుత తరం యువ కథానాయకుల్లో బెస్ట్ డ్యాన్సర్ల లిస్టు తీస్తే రామ్ చరణ్ ముందు వరసలో ఉంటాడు. అతడి డ్యాన్సింగ్ స్కిల్స్ ఏంటన్నది ‘నాయక్’.. ‘బ్రూస్ లీ’ లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఈ తరం బెస్ట్ డ్యాన్సర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ కు చిన్నపుడు డ్యాన్స్ మీద అంతగా ఆసక్తి ఉండేది కాదట. చరణ్ మంచి డ్యాన్సర్ కాగలడా లేదా అని అతడి తండ్రి చిరంజీవి టెన్షన్ కూడా పడేవాడట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు చరణ్.

‘‘నాకు చిన్నపుడు సిగ్గు బాగా ఎక్కువ ఉండేది. ఇంట్లో పార్టీలు జరుగుతుంటే బన్నీ.. శిరీష్ డ్యాన్సులేసేవాళ్లు. నేను దూరంగా ఉండేవాడిని. బన్నీ చిన్నప్పట్నుంచి మంచి డ్యాన్సర్. ఫాస్ట్ మూమెంట్స్ సైతం చాలా ఈజీగా వేసేసేవాడు. నేను వాళ్లతో కలిసి ఒకే ఒక్కసారి డ్యాన్స్ చేశాను. ఆ వీడియో ఎలాగో బయటికి వచ్చేసింది. నాన్న గారు మంచి డ్యాన్సర్ కావడంతో నాకూ అందులో స్కిల్ ఉండాలని కోరుకునేవారు. ఐతే నేను నటనలో శిక్షణ తీసుకున్నా కానీ.. డ్యాన్స్ గురించి పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నేను డ్యాన్స్ చేయగలనా లేదా అని నాన్నకు టెన్షన్ ఉండేది. ఐతే మెల్ల మెల్లగా నాకు నేనుగా డ్యాన్స్ చేయడం నేర్చుకున్నాను’’ అని చరణ్ తెలిపాడు. ఐతే చిన్నపుడు సినిమాల గురించి తమ ఇంట్లో చర్చలే ఉండేవి కాదని.. సినిమాల వార్తలు - ఫొటోలు చూడటానికి కూడా తన తండ్రి ఇష్టపడేవాడు కాదని.. పదో తరగతి తర్వాతే కొంచెం సడలింపు ఇచ్చారని చరణ్ చెప్పాడు.
Tags:    

Similar News