నాన్నతో ప్రేమతో రామ్ చరణ్!!

Update: 2018-03-19 11:42 GMT
పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు పిల్లలే. అలాగే తాము ఎంత ఎదిగినా.. అమ్మానాన్న దగ్గర పిల్లలుగానే ఉంటారు ఆ బిడ్డలు. రామ్ చరణ్ కూడా తనకు తండ్రి అంటే ఎంత ఇష్టమో ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. చూపించాడు కూడా. ఇదే విషయం ఇప్పుడు మరోసారి సాక్ష్యంగా నిరూపితం అయింది.

నిన్నటికి నిన్న వైజాగ్ లో జరిగిన రంగస్థలం మూవీ ఈవెంట్ కు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారు. చిరంజీవి.. సురేఖ.. రామ్ చరణ్.. ఉపాసన.. సుశ్మిత.. ఆమె పిల్లలు.. శ్రీజ.. కళ్యాణ్ ఓరుగంటి.. అల్లు అరవింద్.. ఇలా మొత్తం మెగా ఫ్యామిలీ అంతా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ లో వైజాగ్ కు చేరుకున్నారు. అలాగే ఇవాళ ఉదయం తిరిగి హైద్రాబాద్ కు వచ్చారు. విశాఖకు వెళ్లే సమయంలో సమంత కూడా అదే ఫ్లైట్ లో జర్నీ చేసింది. తిరిగి వచ్చేటపుడు మాత్రం పూర్తిగా మెగా ఫ్యామిలీ మాత్రమే ఫ్లైట్ ఉన్నారు. ఆ సమయంలో దిగిన ఫోటోలలో కొన్ని నెట్ లో దర్శనం ఇచ్చాయి.

చిరంజీవి తన కాలు జాపి చరణ్ పై మోకాలు పై వేయడం.. అదే సిట్యుయేషన్ లో చిరు అండ్ ఫ్యామిలీ కబుర్లు చెప్పుకోవడం.. అల్లు అరవింద్ చేతిలో ఓ గ్లాసు అందులో డ్రింక్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద రంగస్థలం ఈవెంట్ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసిన మెగా మూమెంట్స్ ఫ్యాన్స్ ను భలే హుషారు అలరిస్తున్నాయి.
Tags:    

Similar News