ఎట్టకేలకు ఓ రొమాంటిక్ పిక్ షేర్ చేసిన చైతూ
నాగచైతన్య సోషల్ మీడియాలో ఉంటాడు కాని ఉన్నట్లుగా అనిపించడు. చాలా ముఖ్యమైన సందర్బాల్లో మాత్రమే ట్వీట్ కాని పోస్ట్ కాని షేర్ చేస్తూ ఉంటాడు. నాగచైతన్య ఇన్ స్టాగ్రామ్ లో చాలా తక్కువ పోస్ట్ లు ఉంటాయి. అందులో ఎక్కువ శాతం సమంత ఉన్నవి ఉంటాయి. కాని అవి రొమాంటిక్ గా ఏమీ ఉండవు. మొదటి సారి సమంత ముద్దు పెడుతున్న ఒక ఫొటోను నాగచైతన్య షేర్ చేశాడు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పేందుకు సమంతతో తీసుకున్న ఈ రొమాంటిక్ ఫొటోను చైతూ షేర్ చేశాడు.
సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కాని చైతూ మాత్రం చాలా అరుదుగా షేర్ చేస్తాడు. కనుక చైతూ షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన ఫొటోగా అక్కినేని అభిమానులు అంటున్నారు. నాగచైతన్య ఇలా రొమాంటిక్ ఫొటోలను షేర్ చేయడం ఆనందంగా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇతర హీరోల మాదిరిగా మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నాం అంటున్నారు. ఇక చైతూ ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది లవ్ స్టోరీ మరియు థ్యాంక్యూ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.