చై తొలి వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ డిటైల్స్‌

Update: 2021-12-22 00:30 GMT
`ల‌వ్ స్టోరీ` స‌క్సెస్‌తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ఈ మూవీ త‌రువాత రెట్టించిన ఉత్సాహంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న చై ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం డిజిట‌ల్ వ‌ర‌ల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేయ‌డ‌నికి నాగ‌చైత‌న్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ వార్త గ‌త కొన్ని రోజుల క్రితం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఈ వెబ్ డ్రామాని పాపుల‌ర్ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ నిర్మించ‌బోతోంది.

ఈ సిరీస్ ని `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సిరీస్ ఎలా వుండ‌బోఓంది? ఇందులో నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ ఏంట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే తాజాగా ఈ సిరీస్ లో నాగ‌చైత‌న్య చేయ‌బోతున్న క్యారెక్ట‌ర్ ఇదంటూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌లికి వ‌చ్చేసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సిరీస్ లో హీరో నాగ‌చైత‌న్య జ‌ర్న‌లిస్ట్ గా క‌నిపిస్తార‌ని తెలిసింది. ఈ పాత్ర గురించి ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ వివ‌రించ‌గానే చై చాలా ఎగ్జైట్ అయ్యార‌ట‌. అంతే కాకుండా ఈ పాత్ర టూ డిఫ‌రెంట్ షేడ్స్ తో సాగుతుంద‌ని చెబుతున్నారు.

త్వ‌ర‌లోనే ఈ సీరీస్ కి సంబ‌ధించిన న‌టీన‌టులు, టెక్నీషియన్ ల వివ‌రాల్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించడానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిసింది. ఈ సిరీస్‌లో చైకి జోడీగా ప్రియ భ‌వాని శంక‌ర్‌ని ఫైన‌ల్ చేశార‌ట‌. మూడు సీజ‌న్ లుగా ఈ సిరీస్‌ని ద‌ర్శ‌కుడు ప్లాన్ చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే ఈ సిరీస్‌ని 20 నుంచి 30 ఎపిసోడ్ లుగా తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

ప్ర‌స్తుతం విక్ర‌మ్ కె. కుమార్ .. `థ్యాంక్యూ ` చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తుండ‌గా రాశిఖ‌న్నా, అవికా గోర్‌, మాళ‌విక నాయ‌ర్ హీరోయిన్ లు. ఈ సినిమాతో పాటు `బంగార్రాజు`లోనూ న‌టిస్తున్న నాగ‌చైత‌న్య బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చిత్రం `లాల్ సింగ్ చ‌ద్దా`తో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్‌` ఆధారంగా రీమేక్ అవుతున్న `లాల్ సింగ్ చ‌ద్దా` వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది.


Tags:    

Similar News