బిగ్ న్యూస్: డైరెక్టర్ శంకర్ తో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన చరణ్..!

Update: 2021-02-12 12:22 GMT
దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్‌ - మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా రూపొందనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని.. ఈ సినిమా విషయమై దిల్ రాజు - శంకర్ మధ్య చెన్నైలో చర్చలు కూడా జరిగినట్టు టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించారు.

చరణ్ సోషల్ మీడియా వేదికగా మెగా ప్రాజెక్ట్ ని కంఫర్మ్ చేస్తూ శంకర్ సర్ సినిమాలో భాగం అవుతున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొన్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఎస్వీసీ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా.. రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమా. శంకర్ శైలిలోనే సామాజిక ఇతివృత్తం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని టాక్ నడుస్తోంది. నిజానికి శంకర్‌ తో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్లు ప్రయత్నించారు. ఇప్పుడు చిరు తనయుడు చరణ్‌ కు శంకర్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' సినిమాలు పూర్తైన వెంటనే ఈ శంకర్ - చరణ్ కాంబోలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News