మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే వార్త
ఈ ఏడాది అలా వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. గత నాలుగు నెలలుగా షూటింగ్స్ లేని కారణంగా ఎన్టీఆర్.. త్రివిక్రమ్ మూవీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ కొత్త సినిమాను కూడా సెట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ ఇంకా చిరంజీవి లకు త్రివిక్రమ్ కథ వినిపించాడు అనే ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఆ కథను రెడీ చేశాడని వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ తో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని ఆ సినిమాను పవన్ కళ్యాణ్ నిర్మించబోతున్నాడట. చాలా రోజులుగా పవన్ చరణ్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లకు ఆ సినిమా పట్టాలేకే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాను పవన్ తో పాటు రాధాకృష్ణ హాసిని హారిక బ్యానర్ లో నిర్మించే అవకాశం ఉంది.
ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత చరణ్ చేయబోతున్న సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడా లేదా అంతకు ముందు మరో సినిమాను చరణ్ చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి అయితే పవన్ నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్ మూవీ ఉంటుందనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చే వార్త అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.