ఆ టికెట్ కొనండి.. లక్ష్మీని చూడండి: వర్మ

Update: 2019-02-12 16:44 GMT
'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా రిలీజ్ డేట్ ప్రకటన కోసం అందరికంటే ఆసక్తిగా ఎదురుచూసేది బాలయ్య అభిమానులని అందరూ అనుకుంటారు కానీ... అది కొంతవరకే నిజం.  ఫ్యాన్స్ బాలయ్య ప్రతి సినిమా కోసం వేచి చూస్తారు.  అందులో కొత్తేముంది?  'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదల తేదీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది మాత్రం వివాదాలకు కేరాఫ్ ఆడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ అనే చెప్పుకోవాలి.

ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్ కోసం క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ను విచ్చలవిడిగా వాడుతున్న ఆర్జీవీ ఇప్పుడు మరోసారి 'మహానాయకుడు'సినిమాపై పడ్డాడు.  బాలయ్య సినిమాను ఫిబ్రవరి 22 న రిలీజ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఫిబ్రవరి 14 వ తేదీ ఉదయం 9.27 కు రిలీజ్  అవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ ఫిబ్రవరి 22 న మహానాయకుడు తో పాటు రిలీజ్ అవుతుంది. కాబట్టి మహానాయకుడు సినిమాను చూడడానికి వచ్చిన ప్రతిఒక్కరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూడవచ్చు" అంటూ ట్వీట్ చేశాడు.

నిజానికి ఒక సినిమా స్క్రీన్ చేస్తున్న థియేటర్లలో మరో సినిమా ట్రైలర్ ను ప్రదర్శించడం కామనే కానీ ఇది మాత్రం  ప్రత్యేకమైన సందర్భమే. 'మహానాయకుడు' లో వెన్నుపోటు ఉండదు.. మహానాయకుడి రెండో భార్య లక్ష్మీ పార్వతి పాత్ర ఉండదు.  కానీ ఈ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్లో ఆ రెండూనే ముఖ్యం. వీలైతే రెండు నిముషాల ట్రైలర్లో ఒక నిముషం పాటు వెన్నుపోటు పాటను చూపించినా ఆశ్చర్యపడనవసరం లేదు.   

న్యూట్రల్ ఆడియన్స్ 'మహానాయకుడు' సినిమాలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ రావడాన్నిఎంజాయ్ చేయగలరేమో గానీ వెన్నుపోటు అనుకూల బ్యాచ్ కు మాత్రం పంటిలో రాయిలా.. గొంతులో పచ్చి వెలక్కాయలా.. చెప్పులో రాయిలా.. చెవిలో జోరీగలా.. కంటిలో నలుసులా..కాలిముల్లులా ఇబ్బంది అనిపించడం ఖాయమే!    
Tags:    

Similar News