పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు.. క్రిటిక్ కమ్ ఫిలిం మేకర్ మహేష్ కత్తికి మధ్య గత కొన్ని నెలల్లో వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ పవన్ మీద విమర్శలు గుప్పించడం.. పవన్ అభిమానులు అతడిని టార్గెట్ చేసుకోవడం.. ఇది ఎడతెగని కథలా సాగుతూనే ఉంది. పవన్ అభిమానులు తనను ఇబ్బంది పెడుతున్నారని అంటూనే.. పవన్ మీద మాటల దాడిని మాత్రం మహేష్ కత్తి తగ్గించట్లేదు. తాజాగా పవన్ వైజాగ్ పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యల మీదా కత్తి స్పందిస్తున్నాడు. పవన్ ప్రతి కామెంట్ మీద తనదైన విశ్లేషణ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాడు. దీనిపై పవన్ అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
ఐతే పవన్ ఫ్యాన్స్ అనవసరంగా కత్తి గురించి కామెంట్ చేసి.. అతడిని టార్గెట్ చేసి అతడికి పబ్లిసిటీ తెచ్చిపెట్టొద్దని అంటున్నాడు బన్నీ వాసు. ఇంతకుముందే ఒకసారి కత్తిని ఉద్దేశించి ఇదే తరహాలో కామెంట్ చేశాడు బన్నీ వాసు. ఇప్పుడు మరోసారి మహేష్ కత్తిపై అతను కామెంట్లు చేశాడు. ‘‘మార్కెట్లో ‘కత్తి’లు.. ‘సుత్తి’లు ఉంటాయి.. పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందించాల్సిన అవసరం లేదు’’ అని బన్నీ వాసు అన్నాడు.
మహేష్ కత్తి.. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాజాగా చేసిన కామెంట్లలో కొన్ని..
‘‘సో... మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట! అది కాంగ్రెస్ తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పాడు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది?!?’’
‘‘తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి! పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయను! - పవన్ కళ్యాణ్
ముందు మీ ఫ్యాన్స్ చేస్తున్న గుండాయిజాన్ని ఆపే మంచి పనిచెయ్యి. లేకపోతే, తప్పో పొరపాటో కాదు, మీకు మీ పార్టీకి అదొక గ్రహపాటుగా మారే చాన్స్ ఉంది’’
‘‘నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని తేలుతొంది. అంతే!’’