ఫస్ట్‌ లుక్‌ : బ్రహ్మాజీ 'హంగామా' టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

Update: 2020-12-17 07:30 GMT
నటుడు బ్రహ్మాజీ 55 ఏళ్లు దగ్గర పడుతున్నా కూడా ఆయన చేసే పాత్రలు ఆయన వయసును చూపించవు. ఆయన ఇంకా మూడు పదుల వయసులో ఉన్న వ్యక్తిలాగే ఎక్కువ సినిమాల్లో కనిపించాడు. ఆయన్ను మామూలుగా చూసినా కూడా అలాగే అనిపిస్తాడు. హీరోల మాదిరిగా వయసు దాచుకుని స్క్రీన్‌ పై కనిపిస్తూ వస్తున్న బ్రహ్మాజీ ఈసారి తన వయసు దాచకుండా హంగామా అనే సినిమాలో నటిస్తున్నాడు. విలక్షణ హీరో సత్యదేవ్ చేతుల మీదుగా విడుదలైన హంగామా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది. బ్రహ్మాజీ కాస్త వయసు మీద పడ్డ వ్యక్తిగా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ ను బట్టి అర్థం అవుతుంది.

విహాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హంగామా సినిమా కథ ఏంటీ.. నేపథ్యం ఏంటీ అనే చర్చ జరుగుతోంది. ఇన్ని రోజుల నుండి ఎలాంటి సందడి చేయని బ్రహ్మాజీ ఒకేసారి ఫస్ట్‌ లుక్‌ తో రావడం చర్చనీయాంశంగా ఉంది. ఈ సినిమాలో ఆయన హీరోగా కనిపించబోతున్నాడా లేదంటే కీలక పాత్రలో కనిపించబోతున్నాడా అనేది చూడాల్సి ఉంది. సత్యదేవ్‌ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసిన సందర్బంగా మాట్లాడుతూ ఈ ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక విభిన్నమైన రివెటింగ్‌ డ్రామా. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ బ్రహ్మాజీ అన్న అంటూ సత్యదేవ్‌ ట్వీట్‌ చేశాడు.
Tags:    

Similar News