బోయపాటి కెరీర్ బల్లే బల్లే
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి శీను 'సరైనోడు' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశకు వచ్చేసింది. మరో నెల రోజుల్లో సరైనోడు థియేటర్లలో కూడా సందడి చేసేస్తాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో.. బన్నీ మాస్ అవతారం ఫ్యాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే.. ట్రేడ్ పండిట్స్ నోరెళ్లబెడుతున్నారు. కొన్ని ఏరియాల్లో మహేష్ - పవన్ సినిమాలకు మించి ఆఫర్స్ వస్తున్నాయి. ఇదంతా బన్నీ-బోయపాటి కాంబినేషన్ మహిమే అని ఈజీగానే చెప్పేయచ్చు.
అయితే.. ఇప్పటివరకూ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో బోయపాటి అనౌన్స్ చేయకపోవడంతో.. ఇప్పుడీ డైరెక్టర్ పై రూమర్లు మొదలయ్యాయి. స్టార్ హీరోలెవరూ బోయపాటితో సినిమా అంటే భయపడుతున్నారని పుకార్లు పుట్టిస్తున్నారు కొంతమంది. బాలకృష్ణ వందో సినిమా కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా అంటున్నారు. కానీ ఇవేవీ నిజం కాదనే విషయం చాలామందికి తెలియదు. అసలు బోయపాటి నెక్ట్స్ వెంచర్ ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. సరైనోడు రిలీజ్ తర్వాత దీన్ని అనౌన్స్ చేయనున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు స్టోరీ లైన్ ఓకే చేయించేసుకున్నాడు బోయపాటి. తని ఒరువన్ రీమేక్ తర్వాత చెర్రీ చేయబోయే మూవీ ఇదే. ఒక వేళ గ్యాప్ వస్తే కనక.. సాయిధరం తేజ్ తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్ టెయినర్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే బాధ్యత కూడా బోయపాటికి ఇచ్చారని తెలుస్తోంది.
వరుసగా అన్నీ మెగా క్యాంప్ లోనే మూవీస్ కావడంతో.. ఏ మాత్రం టెన్షన్ పడ్డం లేదట బోయపాటి. ఓ ఫ్లాప్ కొడితే తప్పించేసేయడం, హిట్ కొడితే వెంటబడ్డం లాంటివి మెగా క్యాంప్ లో ఉండవు. కమిట్ మెంట్ ఇచ్చాక ప్రస్తుతం చేసిన సినిమా ఫ్లాప్ అయినా ఆఫర్ పక్కా. అందుకే తన తర్వాతి సినిమాలపై ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా పని చేసుకుపోతున్నాడు బోయపాటి.