మ‌ళ్లీ ఆ స్టార్ హీరో నోట పాట‌!

Update: 2023-06-30 11:21 GMT
మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కి 'లాల్ సింగ్ చ‌డ్డా' రూపంలో గ‌ట్టి  దెబ్బే తెగిలింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా ఊహించ‌ని న‌ష్టాలు తెచ్చిపెట్టింది. అంత‌కు మందు న‌టించిన 'థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్'..'సీక్రెట్ సూప‌ర్ స్టార్' కూడా ప‌రాజ‌యాలే చ‌విచూసాయి. ఇలా వ‌రుస‌గా మూడు ప్లాప్ లు అమీర్ కి గ‌ట్టి షాకే ఇచ్చాయి. ఈ దెబ్బ‌కి కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు షారుక్. ప్ర‌స్తుతం ఆయ‌న కుటుంబంతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.

పాత స్నేహాల్ని..స్నేహితుల‌తో చిలౌట్ అవుతున్నాడు. రెగ్యుల‌ర్ లైఫ్ నుంచి దూరంగా జ‌రిగి వాస్త‌వ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా అమీర్ గురించి  ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం తెలిసింది. మ‌రోసారి ఆయ‌న గాయ‌కుడిగా మార‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. సంగీత ద‌ర్శ‌కుడు రామ్ సంప‌త్ ఆయ‌న స్టూడియోలో అమీర్ ఖాన్ తో క‌లిసి ఉన్న వీడియోను పంచుకున్నారు.

ఇందులో ఆయ‌న అమీర్ కి  సూచ‌న‌లు ఇస్తూ క‌నిపించారు. దీంతో అమీర్ విరామం త‌ర్వాత ప్రాజెక్ట్ పై ఆస‌క్తి సంత‌రించుకుంది. ఆయ‌న ఏదైనా సినిమా కోసం పాట పాడుతున్నారా?  లేక ఆయ‌న సినిమా కోస‌మే ఇలా గొంతు స‌వ‌రిస్తున్నారా? అంటూ సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయితే ఆయ‌న ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో అమీర్ ఇప్ప‌ట్లో సినిమా చేసే అవ‌కాశం లేదు. 2024 లోనే ఆయ‌న నుంచి సినిమా అప్ డేట్ వ‌స్తుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. అంత‌వ‌ర‌కూ ఆయ‌న నుంచి ఎలాంటి అప్ డేట్ ఆశించాల్సిన ప‌నిలేదని అంటున్నారు.

మ‌రి ఈ సాంగ్ మిస్ట‌రీ ఏంటో వీడాలి.  గ‌తంలో షారుక్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన 'గులామ్' సినిమాలోనూ ఓ పాట పాడిన సంగ‌తి తెలిసిందే.  'అతి క్యా ఖండాలా' అంటూ  ఆల‌పించి సంగీత ప్రియుల్ని అల‌రించారు.

ఆ పాట‌కి మంచి గుర్తింపు ద‌క్కింది. అమీర్ న‌టుడిగానే కాదు..మంచి గాయ‌కుడు అంటూ ప్ర‌శంస‌లందుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ గాయ‌కుడిగా  మెప్పించింది లేదు. న‌టుడిగానే క‌నిపించారు.

Similar News