తన 'టీమ్'ను కొనియాడుతున్న బాలీవుడ్ క్వీన్!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వరుసగా సినిమాలను పూర్తి చేస్తోంది. బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా అవకాశం అందుకొని దూసుకెళ్తుంది. ఇటీవలే కంగనా నటించిన దాకడ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా మారింది కంగనా. క్వీన్ సినిమా నుండి ఇప్పుడు తలైవి, దాకడ్ వరకు అన్ని మహిళా ప్రధాన సినిమాలే చేస్తోంది. కంగనా హీరోల సరసన గ్లామర్ అండ్ రొమాంటిక్ పాత్రలు చేసి చాలకాలం అయింది. కానీ హీరోల సరసన కంటే సోలోగానే ఎక్కువగా హిట్స్ కొడుతోంది. ప్రస్తుతం చేస్తున్న దాకడ్ ఫస్ట్ లుక్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటీవలే తమిళనాడు దివంగత లేడీ సీఎం జయలలిత బయోపిక్ పూర్తిచేసిన కంగనా.. దాకడ్ అనే సినిమాను కూడా విడుదలకు సిద్ధం చేస్తోంది.
దాకడ్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు మేకర్స్. కానీ ఈసారి కంగనా కాస్త ట్రెండ్ మార్చినట్లుగా అనిపిస్తుంది. దాకడ్ లో కంగనా లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. చేతిలో కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టిస్తోంది. కంగనాను చూస్తే ఈ సినిమాలో వయోలెంట్ గా ఉండబోతుందని తెలిసిపోతుంది. ఈ సినిమాలో కంగనా.. అగ్ని అనే సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనుంది. అలా రహస్యంగా కంగనా ఈ సినిమాలో శత్రువుల ఆటకట్టిస్తుందని హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఏడాది అక్టోబర్ 1న దాకడ్ సినిమాను విడుదల చేస్తున్నట్లు డేట్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కంగనా. స్టిల్స్ చూస్తే కంగనా తన బృందంతో కలిసి యాక్షన్ సన్నివేశాలు రిహార్సల్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే దాకడ్ పట్ల తమ టీమ్ ఎంతో ప్యాషన్ గా ఉన్నారని.. అందుకే అహర్నిశలు కష్టపడుతూ సీక్వెన్స్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. ఈ సినిమాకు రజనీష్ రాజీ ఘాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Full View