వెర్రి ఆలోచ‌న‌ల‌తో నిద్ర మాత్ర‌లు మింగిన నిర్మాత‌

Update: 2023-01-15 06:30 GMT
ఒక్కోసారి వెర్రి ఆలోచ‌న‌లు ప‌దే ప‌దే వెంటాడి నిద్రాభంగం క‌లిగిస్తుంటాయి. అలా క‌ల‌త నిదుర డిప్రెష‌న్ కి కూడా దారి తీయొచ్చు. ఇది చాలా ప్ర‌మాద‌క‌రమ‌ని మాన‌సిక నిపుణులు చెబుతుంటారు. నిజానికి గ‌త ఏడాది అలాంటి స‌న్నివేశాన్ని ఎదుర్కొన్నాడు క‌ర‌ణ్ జోహార్. వంద‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌తో జూదం ఆడుతున్న మెగా నిర్మాత అత‌డు. భారీ పెట్టుబ‌డుల‌తో కొత్త ద‌ర్శ‌కుడితో రిస్క్ చేస్తున్నావ‌ని బెదిరిస్తుంటే ఎంతో క‌ల‌త‌కు గుర‌య్యాడ‌ట‌.

2022 ఆద్యంతం బాలీవుడ్ ని ఫెయిల్యూర్ దిగాల‌య్యేలా చేసింది. ఓవైపు వ‌రుస‌గా భారీ చిత్రాలు డిజాస్ట‌ర్లుగా మిగులుతుంటే మ‌రోవైపు బ్ర‌హ్మాస్త్ర లాంటి భారీ బ‌డ్జెట్ సినిమా కోసం వెర్రిగా డ‌బ్బును ఖ‌ర్చు చేశాడు క‌ర‌ణ్‌. ఒక నిర్మాత‌గా అత‌డు ద‌ర్శ‌కుడిని న‌మ్మి ప్ర‌యోగం చేసాడు. అది స‌క్సెసా ఫెయిలా? అన్న‌ది అటుంచితే అత‌డు వెర్రి ఆలోచ‌న‌ల‌తో నిదుర ప‌ట్ట‌క చివ‌రికి నిద్ర‌మాత్ర‌లు మింగాన‌ని చెప్పాడు.

గ‌త‌ సంవత్సరం బాలీవుడ్ నిర్మించిన సినిమాల్లో హిట్ సినిమాలను వేళ్లపై లెక్కించవచ్చు. 2022 సంవత్సరం హిందీ ప‌రిశ్ర‌మ‌కు బ్యాడ్ ఇయ‌ర్. అతి కొద్ది సినిమాల్లో `బ్రహ్మాస్త్ర` ఫ‌ర్వాలేద‌నిపించే విజ‌యం అందుకుంది. తాజా ఇంట‌ర్వ్యూలో బ్ర‌హ్మాస్త్ర నిర్మాణంలోని రిస్కీ అంశాల గురించి మాట్లాడుతూ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తనకు నిద్రలేని రాత్రులు ఎదుర‌య్యాయ‌ని తెలిపాడు. ప్రతి రాత్రి అతడు నిదురప‌ట్టేందుకు మాత్రలు వేసుకునే స్థాయికి దిగ‌జారాడు.

ఇదంతా మాస్టర్స్ యూనియన్ పోడ్ కాస్ట్ లో అత‌డు వెల్ల‌డించాడు.  `బిజినెస్ ఆఫ్ బాలీవుడ్` అనే టాపిక్ గురించి క‌ర‌ణ్ పోడ్ కాస్ట్ లో మాట్లాడుతూ విభిన్న మార్కెటింగ్ కాన్సెప్ట్ లను బాగా అర్థం చేసుకోవడానికి కేస్ స్టడీగా సిఫార్సు చేసే చిత్రాన్ని సూచించమని KJoని అడిగారు. ఇటీవ‌ల మీరు పెద్ద రిస్క్ తీసుకున్న చిత్రం ఏదీ? అని ప్ర‌శ్నించ‌గా కరణ్ వెంటనే `బ్రహ్మాస్త్ర` అని చెప్పాడు.

పెద్ద పెట్టుబ‌డుల‌తో తీసిన భారీ సినిమా ఇది. అయాన్ ముఖ‌ర్జీ సినిమా మేకింగ్ కి ఇంకా కొత్త‌వాడే కావ‌డంతో చుట్టూ ఉన్నవారంద‌రిపైనా ఒత్తిడి ఉండేది. నేను ప్రతి రాత్రి ఒక నిద్ర మాత్ర మింగాను`` అని క‌ర‌ణ్ అన్నారు. ప్రశంసలు వచ్చినా.. విమర్శలు వచ్చినా.. అభిప్రాయాలు ఎలా ఉన్నా వాటిని అంగీక‌రించేందుకు సిద్ధంగా లేను. మొదటి సారి నేను చాలా డిఫెన్సివ్ గా ఉన్నాను కాబట్టి ``మీకు నచ్చితే చెప్పండి.. లేకపోతే నేను ఎవ‌రి అభిప్రాయాల్ని తెలుసుకోవాలనుకోను`` అని అనిపించింది. చాలా భయాందోళనకు గురయ్యాను కాబట్టి డిఫెన్స్ లో ప‌డిపోయాను`` అని అన్నాడు. నమ్మకంతో నిర్మించాను కాబ‌ట్టే డబ్బు సంపాదించ‌గ‌లిగాన‌ని అత‌డు పేర్కొన్నాడు.

అనుభ‌వం లేని ద‌ర్శ‌కుడితో ఎందుకు ఇంత భారీ సినిమా తీస్తున్నారు? అతడేమీ మ్యాజిక్ చేయలేడు! రెండు చిత్రాలకు అసిస్టెంట్ గా ప‌ని చేసాడు. ఆ రెండిటిలో అతని పాత్ర‌ ఏమీ ఉన్నట్లు అనిపించలేదు.. అని భ‌య‌పెట్టారు. కానీ నా ఆలోచ‌న‌ల ప్ర‌కారం అత‌డు మేధావి.. సినిమా తీయ‌గ‌ల‌డ‌ని న‌మ్మాను! అని తెలిపారు క‌ర‌ణ్. 50 ఏళ్ల క‌ర‌ణ్ ప్ర‌స్తుతం స్వీయ‌ద‌ర్శ‌కత్వంలో `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 28 ఏప్రిల్ 2023న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News