చిరు పక్కన బాలీవుడ్ భామే??

Update: 2016-06-25 11:06 GMT
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఫైట్ సీన్లతో షూటింగ్ మొదలుపెట్టేసి.. జైల్లో నడిచే సీన్స్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత పాటల షూటింగ్ చేయాలన్నది దర్శకుడు వివి వినాయక్ ఆలోచన. అయితే.. ఇప్పటికీ ఇంకా హీరోయిన్ ఎవరో తేల్చకుండా పాటలు ఎలా తీస్తారన్నదే అసలు టాపిక్.

ఇప్పటికే చిరు పక్కన హీరోయిన్ గా నటించేందుకు అనుష్క - నయనతారల పేర్లు వినిపించాయి. కానీ.. తమకు ఆఫర్ రాలేదని ఇప్పటికే ఈ ఇద్దరు భామలు తేల్చి చెప్పేశారు కూడా. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. పాటల కోసం గ్లామర్ డోస్ కోసం అంతే. అందుకే ఈ రోల్ కి బాలీవుడ్ నుంచి ఓ టాప్ స్టార్ ను తీసుకొస్తే.. విజువల్ గా అదిరిగిపోతుందని.. సినిమాకు అదనపు వాల్యూ అవుతుందని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడట. ఇప్పటికే కొందరు బాలీవుడ్ భామలతో డిస్కషన్స్ కూడా పూర్తి కాగా.. అందులోనుంచి ఇద్దరితో ఫైనల్ టాక్స్ జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రామ్ చరణ్ కాబట్టి.. ఖర్చు విషయంలో రాజీపడే సమస్యే లేదు. అందుకే బాలీవుడ్ భామనే తేవాలనే పట్టుబట్టారని తెలుస్తోంది. ఇప్పుడు హీరోయిన్ విషయంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసినా.. అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాకే పేరు అనౌన్స్ చేస్తారట. ఆ ముహూర్తం వచ్చేవారమే అంటున్నారు.
Tags:    

Similar News