అందుకే నగ్నత్వాన్ని ఇష్టపడతాను! -ఉర్ఫీ జావేద్
నటి కం మోడల్ ఉర్ఫీ జావేద్ తనదైన యూనిక్ ఫ్యాషన్ సెన్స్ తో ఇంటర్నెట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అసలు ఒంటిపై నూలు పోగైనా లేకుంటేనే తనకు సౌకర్యం అని అసలు నిజాన్ని బయట పెట్టి మరోసారి సంచలనంగా మారింది.
ఉర్ఫీ తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో నెటిజనుల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ``బట్టలు నా ఒంటికి అంటుకుంటే అలెర్జీ`` అని చెబుతూ ఏవగించుకుంది. ఉర్ఫీ ఉన్ని దుస్తులను ధరించిన తర్వాత తనకు ఎలా కురుపులు పుండ్లు వచ్చాయో వీడియోలో లైవ్ చూపించింది. తన ఈ `అలెర్జిక్ వ్యథ` గురించి గోడు వెల్లబోసుకుంది.
దద్దుర్లు బొడిపెలతో నిండిన ఆమె కాళ్ల ఫోటోను కూడా ఉర్ఫీ షేర్ చేసింది. చలికాలంలో ఎవరికైనా ఇలాంటి అలర్జీలు వస్తాయా? అంటూ ప్రశ్నించింది. అవును లేదా కాదు అని జవాబివ్వాలని తన ఫాలోవర్స్ ని కోరింది. భారతదేశంలోని లక్షలాది మంది నెటిజన్ లకు ఉర్ఫీ జావేద్ వేషధారణపై అవగాహన ఉంది. ఏదైనా కొత్తదనం ఇంకేదైనా సంథింగ్ లేనిదే ఉర్ఫీ లేనే లేదు. ప్రత్యేకమైన వింత దుస్తులను ధరించడాన్ని అమితంగా ఇష్టపడుతుంది. ఉర్ఫీ ఫ్యాషన్ సెన్స్ కోట్లాది మంది తనవైపు చూసేలా చేసింది.
ప్రశంసలతో పాటు విమర్శలు కురుస్తున్నాయి. చట్టపరమైన చర్యలతో ఉర్ఫీ ఇబ్బందులకు గురవుతోంది. గత వారం రాజకీయ నాయకురాలు చిత్రా వాగ్ ఉర్ఫీ డ్రెస్సింగ్ సెన్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అప్పటి నుండి ఉర్ఫీ తన పబ్లిక్ అప్పియరెన్స్ లో కొన్నిసార్లు మంచి బట్టలు(బాగా కప్పే) ధరించి కనిపించింది. ఈసారి ఉన్ని దుస్తులు ధరించింది. చాలా మంది నెటిజనులు దీనికి స్పందిస్తూ-``పోలీసులకు ఫిర్యాదు తర్వాత ఇలా మారింది!`` అంటూ కామెంట్లు చేసారు.
అయితే ఇంతలోనే ఉర్ఫీ ఊహించని ట్విస్టిచ్చింది. అసలు తాను అలాంటి దుస్తులను ఎందుకు ధరించాల్సి వచ్చిందో మౌనం వీడింది. ఇన్ స్టా కథనాలలో ``నాకు బట్టలు అంటే అలెర్జీ``అని తెలిసింది. అసలు సంగతిని తన అనుచరులకు పూస గుచ్చి వివరించింది. ఉర్ఫీ తన మొదటి స్టోరీలో మచ్చలతో నిండిన తన కాళ్ళ ఫోటోను షేర్ చేసింది. చలికాలంలో ఎవరికైనా ఇలాంటి అలెర్జీలు వస్తాయా? అని ప్రశ్నించింది. దీనికి అవును లేదా కాదు అనే ఆప్షన్ లు ఇచ్చి అభిప్రాయాలు కోరింది. తన కాళ్ల దుస్థితికి సంబంధించిన మరో వీడియోను షేర్ చేసి ``నాకు బట్టలంటే అక్షరాలా ఎలర్జీ`` అని క్యాప్షన్ ఇచ్చింది. కాబట్టి నేను బట్టలు ఎందుకు ధరించడం లేదో ఇప్పుడు మీకు బాగా తెలిసింది. నాకు ఇలాంటి సీరియస్ సమస్య ఉంది. బట్టలు వేసుకున్న తర్వాత నా శరీరం స్పందించడం ప్రారంభిస్తుంది. దానికి ఇదే ప్రూఫ్. అందుకే నేను నగ్నంగా ఉండటాన్ని ఇష్టపడతాను! అని చెప్పింది.
రాజకీయ నాయకుల నుంచి తాను ఎదుర్కొంటున్న ద్వేషం ఎదురు దెబ్బల గురించి ఉర్ఫీ తీవ్రంగా కలత చెందింది. ప్రజలు తనను ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. నిజానికి ముంబయి వీధుల్లో నగ్నత్వం ప్రదర్శించినందుకు ఉర్ఫీపై బిజెపి మహారాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు చిత్రా వాఘ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని తన కెరీర్ ని సదరు నాయకురాలు టార్గెట్ చేశారని ఆవేదన చెందింది ఉర్ఫీ. తరువాత ఈ చర్యపై తన ఫీలింగ్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.``రాజకీయ నాయకులపై ఇలాంటివి అప్ లోడ్ చేయడం చాలా ప్రమాదకరమని నాకు తెలుసు. కానీ ఇలాంటి వాళ్లంతా నన్ను ఎలాగైనా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను లేదా వారే నన్ను చంపేస్తారు!`` అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నేను ఏ తప్పూ చేయలేదు. నాయకులు ప్రజలు ఎటువంటి కారణం లేకుండా నాకు వ్యతిరేకులుగా మారారు... అని వ్యాఖ్యానించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఉర్ఫీ ప్రస్తుతం స్ప్లిట్స్ విల్లా 14లో కనిపిస్తోంది.