అదరహో! మాల్దీవుల్లో బికినీ సయ్యాటలు..

Update: 2015-07-27 20:45 GMT
ధూమ్‌ 2 సూపర్‌ హిట్‌ అవ్వడానికి బిపాసా బికినీ వేషాలు చాలా వరకూ ప్లస్‌ అయ్యాయి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా కనువిందు చేయగలిగింది అంటే అది నల్లకలువ మహత్యం కూడా. ఐశ్వర్యారాయ్‌ ఓ వైపు బిప్స్‌ వయ్యారాలు మరో వైపు అదరహో అనిపించాయి. ఆ తర్వాత మళ్లీ బిపాసా ఆ రేంజలో రెచ్చిపోయి బికినీ సోయగాల్ని ప్రదర్శించినా అంతగా పాపులర్‌ కాలేదు. అయితే ఓ ప్రయివేటు పార్టీలో బిప్స్‌ బికినీ ఫోటోలు ప్రస్తుతం ఆన్‌ లైన్‌ లో హాట్‌ టాపిక్‌.

    ప్రస్తుతం ఈ భామ ఓ పార్టీని ఎంజాయ్‌ చేయడానికి మాల్దీవులు వెళ్లింది. అక్కడే కొన్నాళ్ల పాటు సేద దీరి ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ సెలబ్రేషన్స్‌ కూడా చేసుకోవడానికి రెడీ అవుతోంది. కరణ్‌ ఫింగ్‌ గ్రోవర్స్‌, వ్యక్తిగత ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ డియానా  పాండే ఇద్దరితో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోందిప్పుడు. అంతేనా ఇదిగో నా బికినీ బాడీ చూడండి అంటూ కొన్ని ఫోటోల్ని ఆన్‌ లైన్‌ లో ప్రదర్శనకు పెట్టింది. అప్పట్లో యోగా సీడీల్లో కనిపించనిది, పెద్ద తెరపై బికినీ వయ్యారాల్లో కనిపించనిది .. ఈ బికినీ స్టిల్స్‌ లో కనిపిస్తోంది. వయసు మీరే కొద్దీ బిప్స్‌ లోని వయ్యారాలు వేడెక్కించేవిగా కనిపిస్తున్నాయి. దటీజ్‌ బిప్స్‌.
Tags:    

Similar News