• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమె మొదటి వర్ధంతి...

ఆమె మొదటి వర్ధంతి సందర్బంగా బయోపిక్‌ ప్రకటన

By - Tupaki Desk
Update: 2021-07-05 02:30 GMT
బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ కొరియోగ్రాపర్‌ సరోజ్‌ ఖాన్‌ గత ఏడాది గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా సుపరిచితురాలు అయిన ఆమె మృతి ప్రతి ఒక్కరికి శోకం మిగిల్చింది. మూడు వేల పాటలకు కొరియోగ్రాఫర్‌ గా వ్యవహరించిన ఆమె ఎన్నో టీవీ షో ల్లో కనిపించారు. ఆమె 71 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి చెంది సరిగ్గా ఏడాది అయ్యింది. ఆమె మొదటి వర్ధంతి సందర్బంగా టీసిరీస్ అధినేత భూషన్‌ కుమార్ ఆమె బయోపిక్ ను ప్రకటించాడు.

ఇండియన్ సినీ ప్రేమికులకు ఆమె గురించి మరింతగా తెలియజేసేందుకు ఈ బయోపిక్‌ ను తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. వేలాది పాటలకు కొరియోగ్రఫి చేసిన అరుదైన లేడీ కొరియోగ్రఫర్‌ సరోజ్ ఖాన్‌ అని.. ఆమె  జీవితం అంత సాఫీగా సాగలేదు అందుకే ఆమెకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులకూ చూపించాలనుకోవడం మంచి నిర్ణయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు. సరోజ్ ఖాన్‌ చిన్న వయసు నుండే ఇండస్ట్రీలో కొనసాగుతూ వచ్చారు. ఆమె డెడికేషన్‌ ను ఆమె ఒక పాట కోసం పెట్టే శ్రమను చూసి హీరోలు మరియు దర్శకులు కూడా ఆశ్చర్యపోయే వారు.

కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సరోజ్‌ ఖాన్ ఆ తర్వాత తర్వాత కెరీర్‌ లో మెట్టు మెట్టు ఎదుగుతూ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలోనే టాప్‌ కొరియోగ్రాఫర్‌ గా కొనసాగింది. ఆమె డేట్ల కోసం స్టార్‌ హీరోలు సైతం వెయిట్‌ చేసేంత స్థాయికి ఆమె వెళ్లారు. ఆమె కెరీర్‌ ఎంతో మందికి ఆదర్శణంగా నిలుస్తుందనే ఉద్దేశ్యంతో బయోపిక్‌ ను ప్లాన్‌ చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ఈ బయోపిక్‌ కు సంబంధించిన మరింత వివరాలను వెళ్లడిస్తామంటూ ఆయన పేర్కొన్నాడు. మొదటి వర్ధంతి సందర్బంగా బయోపిక్‌ ప్రకటన చేసిన మేకర్స్ రెండవ వర్ధంతి వరకు సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    
  • Saroj Khan 
  • Saroj Khan Biopic 
  • Saroj Khan First Death Anniversary 

Similar News

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

Copyright @2026

Powered by Blink CMS