మళ్లీ రచ్చ చేసిన అమ్మ రాజశేఖర్.. ఇలా అయితే కష్టం
వయసులో పెద్ద వాడు అయిన అమ్మ రాజశేఖర్ ఇంటి సభ్యులందరికి మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తున్నాడు. ప్రతిది ఆయన అనుకున్నట్లుగా జరగాలి.. ఆయన్ను గౌరవిస్తూ అంతా ఆయనకు సపోర్ట్ గా నిలవాలి. ఎవరు కూడా ఆయన్ను నామినేట్ చేయకూడదు. ప్రతి ఒక్కరు ఆయన్ను భేష్ అనాలి. ఇలా అనేక కారణాల వల్ల అమ్మ రాజశేఖర్ హౌస్ కు అన్ ఫిట్ అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు నాలుగు వారాలుగా ప్రేక్షకులు ఆయన ఎలిమినేట్ అయితే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎలిమినేట్ అయినట్లే అయ్యి నోయల్ కారణంగా మళ్లీ సేవ్ అయ్యాడు.
అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ అయిన నోయల్ ఈ వారం ఎలిమినేషన్ లేకుండా చేశాడు. దాంతో అమ్మ రాజశేఖర్ మరో వారంకు సేవ్ అయ్యాడు. దానికి తోడు ఈ వారం కెప్టెన్సీ కంటెస్టెంట్ గా కూడా ఎంపిక అయ్యాడు. ఇక నేడు ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ ప్రసారం కాబోతుంది. నేటి ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోలో అభిజిత్ మరియు అమ్మ రాజశేఖర్ లు గొడవ పడటం చూపించారు. ఈ వారంలో మళ్లీ ఎక్కువ మంది అమ్మ రాజశేఖర్ ను నామినేట్ చేయడంతో ఆయన కోపం మళ్లీ నషాలంకు అంటింది.
తనను నామినేట్ చేసిన ప్రతి ఒక్కరిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా అభిజిత్ పై ఆగ్రహం తో నేను ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చాను అన్నాడు. నువ్వు ఖాళీగా కూర్చుంటావు అంటూ అభిజిత్ పై ఫైర్ అయ్యాడు. ఇలా అమ్మా రాజశేఖర్ ఇతరులతో గొడవ పడటం చాలా కామన్ అయ్యింది. అందుకే ఈ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్ కు నామినేట్ అయితే ఖచ్చితంగా బయటకు వెళ్లి పోవడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇలా అయితే కష్టం అంటూ ఎంత మంది ఆయన్ను హెచ్చరించినా కూడా ఫలితం మాత్రం శూన్యం.