మరి అంత బలుపు పనికిరాదు బ్రో.. అఖిల్ ​పై బిగ్​ బాస్​ అభిమానుల పంచ్​లు

Update: 2020-10-21 05:15 GMT
బిగ్​ బాస్​ సీజన్​ 4 కాస్త మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమయినా.. రాను రాను ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ సీజన్​లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం మోనాల్​ ట్రైయాంగిల్​ లవ్​ ట్రాక్​. మోనాల్​ తో అఖిల్​ .. అభిజీత్​ లవ్​ ట్రాక్​ నడపడం.. ఆమె కోసం వాళ్లిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడటం చూస్తున్నాం. అయితే కేవలం వీళ్ల లవ్​ ట్రాక్​ కోసమే బిగ్​బాస్​ను చూసేవారూ ఉన్నారు. అయితే ఈ క్రమం లో అఖిల్​ ప్రవర్తన మాత్రం మొదటి నుంచి కాస్త వివాదంగా ఉంది. అతడి మాటలు, ప్రవర్తనలో కాస్త పొగరు ధ్వనిస్తుందని బిగ్​బాస్​ చూసే ప్రేక్షకులు ఫేస్​బుక్​లో ఎన్నోసార్లు కామెంట్లు పెట్టారు. ‘మరీ అంత బలుపు పనికి రాదు బ్రో’అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. అయితే వివిధ కారణాల వల్ల అఖిల్​ దర్జాగా కొనసాగుతున్నాడు. కానీ రీసెంట్ ​గా జరిగిన ఓ ఘటన మాత్రం హౌస్​ కొంపముంచినట్టు ఉంది..

ఇంతకీ ఏం జరిగిందంటే..  గత వారం కమెడియన్ కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హౌస్‌లో ఒక్కొక్కరి గురించి విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఐతే అఖిల్ గురించి చెబుతూ.. ‘టాస్కుల్లో అఖిల్​ ఫుల్ ఎనర్జీగా ఆడుతున్నాడు. బాగా కష్టపడుతున్నాడు కూడా.. కానీ ఫెయిలవుతున్నాడని.. అలాగే ప్రయత్నించాలని అన్నాడు’ అని చెప్పాడు. దీనికి వెంటనే  అఖిల్ రియాక్ట్​ అయిపోయాడు. ‘నువ్వు టాస్కుల్లో గెలిచినా కూడా బయటికి వెళ్లిపోయావు బ్రో’ అంటూ పంచ్ వేశాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్​ నుంచి ఎలిమినేట్​ అయిన ఓ వ్యక్తిపై అఖిల్​ అలా కౌంటర్​ వేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో తొందర్లోనే అఖిల్​ కూడా బయటకు వెళ్లిపోయే సమయం ఆసన్నమైనట్టుందని ప్రేక్షకులు కౌంటర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News