• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పుష్ప : ది రైజ్' కోసం ఈ...

'పుష్ప : ది రైజ్' కోసం ఈ సారి అంత‌కు మించి..

By - Tupaki Desk
Update: 2021-12-09 07:33 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు ఏ నోట విన్నా ఒక‌టే మాట `పుష్ప : ది రైజ్`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న ఊర మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ముత్యంశెట్టి మీడియాతో క‌లిసి మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీపై ద‌ర్శ‌కుడు సుకుమార్ కూడా భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. `బాహుబ‌లి` త‌ర‌హాలో రెండు పార్ట్‌లుగా నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్‌ని `పుష్ప : ది రైజ్` పేరుతో విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నఈ మూవీని ఐదు భాష‌ల్లో వ‌రల్డ్ వైడ్‌గా ఈ నెల 17న విడుద‌ల చేస్తున్నారు.

ఇక రిలీజ్ ద‌గ్గ‌ర‌ పడుతుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్‌ని స్పీడ‌ప్ చేసేసింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. బ‌న్నీ న‌టించిన‌ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి సంబంధించిన మ్యూజిక‌ల్ ఈవెంట్ చాలా గ్రాండ్‌ గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ లైవ్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ తో లైవ్‌ పెర్పామ్ చేయ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ ఈవెంట్ గురించి ఇండ‌స్ట్రీ చాలా గొప్ప‌గా చెప్పుకున్నారు.

అయితే ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకున్న మేక‌ర్స్ `పుష్ప : ది రైజ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అంత‌కు మించి అనే స్థాయిలో ఏర్పాటు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌భాస్ ని ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌ గా ఆహ్వానించాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. అయితే ప్ర‌భాస్ ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తాడా? లేదా అన్న‌ది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది. ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా ఓ టిపిక‌ల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలోని కొన్ని లిరిక‌ల్ వీడియోలు, టీజ‌ర్‌.. సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి
Tags:    
  • PushpaTheRise 
  • PushpaRaj 
  • PushpaTheRiseOnDec17 
  • alluarjun 
  • iamRashmika 
  • aryasukku 
  • ThisIsDSP 
  • Mythri Movie Makers 
  • adityamusic 

Similar News

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

రామాయణం బడ్జెట్‌లో 9 శాతంతో తెరకెక్కిన గాడ్జిల్లా మైనస్ జీరో దూకుడు!

2026-11-09 06:05 GMT

జపనీయుల మధ్య దేవరకొండ ఫ్యామిలీ స్పెషల్ దివాళీ.. వీడియో వైరల్!

2026-11-09 05:26 GMT

రామాయణంపై ఈ తరం వింత ప్రశ్న..!

2026-11-09 04:58 GMT

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

Copyright @2026

Powered by Blink CMS