మన జీవితంలోనే బెస్ట్ ఇయర్ 2020నే: పూరి

Update: 2021-01-01 06:34 GMT
2020 సంవత్సరం ప్రపంచంలోని అందరికీ గుర్తుండిపోయింది. కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి, ఆదాయం కోల్పోయి అందరూ రోడ్డునపడ్డారు. ఇబ్బంది పడ్డారు. అన్ని మూతపడి కోట్ల నష్టం వచ్చింది. అయితే ఈ సంవత్సరాన్ని తిట్టుకుంటే.. 2020 సంవత్సరమే మన జీవితంలో అత్యుత్తమైన సంవత్సరంగా పరిగణిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన పూరీ మ్యూజింగ్స్ లో ‘2020 సంవత్సరం యొక్క గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు. మరి 2020 బెస్ట్ ఇయర్ అని పూరి అంటున్నారు.

అందరూ తిట్టుకుంటున్న 2020 సంవత్సరం మన జీవితంలోనే బెస్ట్ ఇయర్ అంటున్నాడు పూరి జగన్నాథ్. ఈ 2020 మనకి చాలా నేర్పిందని చెబుతున్నాడు. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో అందరికీ అర్థమైందని తెలిపారు.మనిషికి ఇమ్యూనిటీ ఎంత అవసరమో తెలిసిందన్నారు. మంచి ఆహారం యొక్క విలువ తెలిసిందని వివరించారు.

పుట్టిన తర్వాత మనం ఇన్ని సార్లు ఎప్పుడూ హ్యాండ్ వాష్ చేసుకోలేదని.. పల్లెటూళ్లలో చదువుకొని వారికి కూడా చాలా విషయాలు తెలిశాయన్నారు. వైరస్‌, న్యూట్రేషన్‌, శానిటైజర్‌‌, క్వారంటైన్‌, యాంటీ బాడీస్‌, ప్లాస్మా, స్ట్రెయిన్‌ ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయ్‌. మొదట్లో నెలరోజులు లాక్‌డౌన్‌ అంటే మనకి పిచ్చి లేచింది. ఖాళీగా ఇంటిలో కూర్చోవాలంటే.. మెంటల్‌ హెల్త్‌ చాలా అవసరం అని తెలుసుకున్నాం. మనలో ఓర్పు బాగా పెరిగిందని వివరించారు.

డబ్బు ఉన్నా, లేకపోయినా.. ఎలా బతికామో.. మనకే తెలియదు. నిజమైన స్నేహితులెవరో ఇప్పుడే తెలిసింది. లైఫ్‌లో సేవింగ్స్‌ ఎంత అవసరమో తెలిసివచ్చిందని పూరి జగన్నాథ్ విశ్లేషించారు.  అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిళ్లు తగ్గాయ్‌. నేచర్‌ చాలా పవర్‌ఫుల్‌ అని తెలిసింది.  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నేర్చుకున్నాం. ఆడవాళ్లు.. బంగారం, కొత్తచీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం. ఏ దేవుడూ మనల్ని కాపాడలేడని తెలిసింది..'' అంటూ 2020 యొక్క గొప్పతనాన్ని పూరీ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News