మేక‌ప్ మేన్ కి బ్రాండ్ న్యూ కార్ గిఫ్టిచ్చిన బ్యూటీ

Update: 2020-10-27 05:30 GMT
అప్పుడెప్పుడో ఓ మ‌ల్టీమిల‌య‌నీర్ త‌న కంప‌నీలో ప‌నిచేసే వారికి కార్లు గిఫ్ట్ గా ఇచ్చాడ‌టంటే ఔరా అనుకున్నాం. అలాంటి ప‌నే ఓ స్టార్ హీరోయిన్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు త‌న‌ని పిక్ అప్ చేసుకోవ‌డానికి వ‌చ్చే కార్ డ్రైవ‌ర్ కార్ ని ఫైనాన్షియ‌ర్స్ తీసుకెళ్లార‌ట‌. ఆ విష‌యం తెలిసి అనుష్క అదే కారుని అత‌నికి గిఫ్ట్ గా ఇచ్చి త‌న గొప్ప మ‌న‌సుని చాటుకుంది. ఇదే త‌ర‌హాలో స్పందించి కార్ ని గిఫ్ట్ ‌గా ఇచ్చిందిట‌ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ త‌న వ‌ద్ద ప‌నిచేసే స్టాఫ్ మెంబ‌ర్ కి ఏకంగా బ్రాండ్ న్యూ కార్ ని బ‌హుమ‌తిగా ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌న వ‌ద్ద ఎన్నో ఏళ్లుగా మేక‌ప్ ‌మెన్ ‌గా వ‌ర్క్ చేస్తున్న వ్య‌క్తికి పండ‌గ సంద‌ర్హంగా కార్‌ని గిఫ్ట్ గా ఇచ్చిన‌ట్టు తెలిసింది. జాక్విలిన్ గురించి ప‌రిచ‌యం అవ‌ర‌సం లేదు. ఇంత‌కుముందు సాహో చిత్రంలో అదిరిపోయే ఐటెమ్ నంబ‌ర్ తో హీటెక్కించిన ఈ భామ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి బాగా సుప‌రిచితం.

జాక్వెలిన్ ప్ర‌స్తుతం ఓ సినిమాలో ట్రాఫిక్ పోలీస్ ‌గా న‌టిస్తోంది. అదే డ్రెస్ తో సెట్ లో వున్న జాక్వెలిన్ సెట్లోనే త‌న మేక‌ప్ మెన్ కి కార్‌ని గిఫ్ట్ గా ఇచ్చిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అక్క‌డే పూజ చేస్తున్న వీడియో నెట్టింట్లో సంద‌డి చేస్తోంది. 
Tags:    

Similar News