'బాపు' జయంతి స్పెషల్..!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో బాపు ఒకరు. నేడు ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. సినిమాలపై ఎలాంటి అవగాహన లేకుండానే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాపు ఫస్ట్ సినిమా 'సాక్షి' తోనే అందరి దృష్టిని ఆకర్శించాడు. 1967లో 'సాక్షి'తో ప్రారంభమైన బాపు సినీ ప్రస్థానం 2011లో వచ్చిన 'శ్రీరామరాజ్యం' వరకు సాగింది. 'బుద్ధిమంతుడు' 'ఇంటి గౌరవం' 'సంపూర్ణ రామాయణం' 'అందాల రాముడు' 'శ్రీరామాంజనేయ యుద్ధం' 'సీతా కల్యాణం' 'భక్త కన్నప్ప' 'స్నేహం' 'గోరింత దీపం' 'మనవూరి పాండవులు' 'తూర్పు వెళ్లే రైలు' 'రాధా కల్యాణం' 'కృష్ణావతారం' 'పెళ్లి పుస్తకం' 'రాధా గోపాళం' 'సుందరకాండ' వంటి అద్భుత చిత్రాలు బాపు నుంచి వచ్చాయి. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు 48 చిత్రాలకు దర్శకత్వం వహించిన బాపు.. ఆరు నంది అవార్డులు మరియు రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆంతేకాకుండా 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు.. 2013లో పద్మశ్రీ అవార్డులు వరించాయి.
'బాపు' అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. 1933 డిసెంబర్ 15న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ఆంధ్ర పత్రికలో కార్టూనిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన బాపు తరువాత దర్శకుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. గీతకారుడిగా, సంగీతకారుడిగా, కార్టూనిస్టుగా, దర్శకుడిగా అన్ని రంగాల్లో బాపు తన ప్రతిభను చాటుకున్నారు. సినిమాలో ఏదైనా సన్నివేశాన్ని తెరకెక్కించాలంటే బాపు ముందుగా కార్టూన్ రూపంలో గీసి ఆ తర్వాత షూట్ చేసేవారు. రామాయణసారం లేకుండా బాపు సినిమాలు లేవని చెప్పవచ్చు. రామాయణ మహాకావ్యాన్ని అణువణువునా జీర్ణించుకుని ప్రతి కథలోనూ రామాయణసారం చెప్పే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. బాపు గురించి మాట్లాడుకుంటూ ముళ్లపూడి వెంకటరమణ చెప్పకపోతే అది పరిపూర్ణం కాదు. ఒకే ఆత్మకు రెండు రూపాలుగా.. ఒకే భావాన్ని పలికే రెండు పదాలుగా.. స్నేహానికి సరైన నిర్వచనంగా ఇద్దరూ నిలిచారు. 'శ్రీరామరాజ్యం' సినిమా నిర్మాణంలో ఉన్న సమయంలో ముళ్లపూడి వెంకటరమణ కన్నుమూశారు. అప్పటి నుంచి బాపు మానసికంగా శారీరకంగా బాగా కృంగిపోయిన బాపు.. 2014 ఆగస్టు 31న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.