తన దేవుడితో సినిమా కోసం బండ్ల విశ్వప్రయత్నాలు
పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు కోట్ల అడ్వాన్స్ లు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. అంతటి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ మరో సినిమా నిర్మించే అవకాశం ను దక్కించుకున్నాడు. కొన్ని నెలల క్రితమే బండ్ల గణేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తన దేవుడితో సినిమా చేయబోతున్నాను అంటూ బండ్ల ప్రకటించినప్పటి నుండి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
కొన్ని వారాల క్రితం మీడియాలో వస్తున్న వార్తలపై పవన్ తో సినిమా విషయమై తాను ప్రకటన చేసే వరకు ఎవరు కూడా నమ్మవద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తన దేవుడు పవన్ కోసం బండ్ల గణేష్ ఒక కథను స్టార్ రైటర్ కోన వెంకట్ వద్ద రెడీ చేయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
పవన్ ను కాలేజ్ లెక్చరర్ గా చూపుతూ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథను కోన రెడీ చేశాడట. ఈ కథకు పూరి డైరెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కు ఉన్న కమిట్ మెంట్స్ అన్ని పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మొదలు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. పవన్ తో మూవీ కోసం బండ్ల చేస్తున్న ప్రయత్నంకు సినీ జనాలు కూడా అబ్బుర పడుతున్నారు.