ప్రాధేయపడుతూ ఇదేం కామెడీ బండ్లా!
తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ బండ్ల గణేష్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గుడ్డు పెట్టనే లేదు దానికి పేరు పెట్టినట్టుగా ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరి తను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు టీవీల్లో పెద్ద హంగామా సృష్టించాడు. తాను.. తన పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానంటూ స్టేట్ మెంట్లిచ్చి చివరికి నవ్వుల పాలయ్యాడు. కాంగ్రెస్ దారుణంగా ఓటమిపాలై తెరాస అధికారాన్ని మరోసారి దక్కించుకోవడంతో పలాయనం చిత్తగించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. గత కొంత కాలంగా మీడియాకు.. రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న బండ్ల మళ్లీ యాక్టివ్ అయ్యాడు.
ఈ దఫా ఏకంగా ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టాడు. పల్నాడులో అధికార వైసీపీ - ప్రతిపక్ష టీడీపీ మధ్య పల్నాడులో జరుగుతున్న గొడవల్ని ఎత్తిచూపుతూ పల్నాడు పరువు తీయొద్దంటూ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ``మీకు దండం పెడతా.. పల్నాడు పరువు తీయొద్దు`` అంటూ ప్రాధేయపడ్డాడు. ఆధిపత్య పోరుతో ఆంధ్రాను మరో బీహార్ గా మార్చొద్దంటూ తనదైన శైలిలో అధికార - ప్రతిపక్ష పార్టీలకు కౌంటరిచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య గొడవలతో పల్నాడు పరువుపోయిందని - ఇప్పటికైనా ఇరు పార్టీల వారు సంయమనంతో ఆలోచించి ప్రలజకు మంచి చేయాలని విజ్ఞప్తి చేశాడు. దగా పడ్డ తెలుగు ప్రజలారా ఏ నాయకుడినీ నమ్మొద్దంటూ పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది.
అన్నట్టు బండ్ల రాజకీయాలు వదిలి సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఘనమైన ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం సినిమాల గురించి కదా ఆలోచించాలి. ఇంకా ఎందుకు ఆ పాడు రాజకీయాలు.. పాడు పిచ్చి గోల!