పవన్ తో సినిమాపై బండ్ల గణేశ్ క్లారిటీ!

Update: 2021-05-19 10:38 GMT
పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేష్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. పవన్ తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో 'తీన్ మార్','గబ్బర్ సింగ్' సినిమాలు వచ్చాయి. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ పిలిచి మరీ బండ్ల గణేష్ కు 'గబ్బర్ సింగ్' వంటి సూపర్ హిట్ సినిమాకు అవకాశం ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్' సినిమా హిట్ తరువాత బండ్ల గణేష్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.  

ఆ తర్వాత రాజకీయాల్లో వెళ్లి.. చేతులు కాల్చుకొని.. తిరిగి మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరునేకెవ్వరు' సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈయన మరోసారి నిర్మాత అవతారం ఎత్తుతున్నాడని చెప్పాడు. అది కూడా పవన్ కళ్యాణ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్ పై రకరకాల వార్తలు మీడియాలో ప్రత్యక్ష్యమవుతున్నాయి.

పవన్  తనతో సినిమా చేస్తానని మాట ఇచ్చాడనీ, కానీ ఇంకా తాను అందుకు సంబంధించిన పనులను మొదలుపెట్టలేదని గణేశ్ అప్పుడే చెప్పాడు. అయితే రీసెంట్ గా  రమేశ్ వర్మ ఒక కథతో పవన్ ను ఒప్పించాడనీ, ఆ సినిమాకి నిర్మాత గణేశ్ అనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన గణేశ్, ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. పవన్ తో సినిమా ఓకే కాగానే తానే వెల్లడి చేస్తానని అన్నాడు.  

ఇక  రాజకీయాలలోకి వెళ్లిన పవన్, 'వకీల్ సాబ్' తో రీ ఎంట్రీ ఇచ్చాడు.మొదటి షో తోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.  వీటితో పాటు హరీష్ శంకర్ తో ఓ సినిమా, సురేందర్ రెడ్డి రెడ్డి తో ఓ సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే వకీల్ సాబ్ సినిమా నిర్మించిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్న్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు. అంటే ఇవన్నీ అయ్యాకే బండ్ల గణేష్ తో చిత్రం ఉంటుందన్నమాట.పవన్ తో సినిమా ఓకే కాగానే తానే వెల్లడి చేస్తానని అన్నారు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయటమే.
Tags:    

Similar News