భారీ ప్రాజెక్టులతో బాలయ్య .. కుర్ర హీరోలను మించిపోతున్నాడే!
బాలకృష్ణకి మొదటి నుంచి కూడా దూకుడు ఎక్కువే. ఒక సినిమా హిట్ కొట్టేసిందని చెప్పేసి, దాని గురించే ఆలోచిస్తూ .. దాని గురించే మాట్లాడుతూ కాలక్షేపం చేయడం ఆయనకి ఎంతమాత్రం అలవాటు లేని పని. ఒక సినిమా విడుదల సమయానికి తాను రెండో సినిమా షూటింగులో ఉండాలనేది ఆయన ఆలోచన. అందుకు తగినట్టుగానే ఆయన ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కథ ఏదైనా .. కథనం ఎలా ఉన్నా అది మాస్ ప్రేక్షకులను థియేటర్ల చుట్టూ తిప్పేలా ఉండాలని ఆయన కోరుకుంటాడు. అలా ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.
'సింహా' .. 'లెజెండ్' తరువాత బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రానున్న సినిమా కావడంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం కాచుకుని కూర్చున్నారు. ఈ సినిమా తరువాత బాలకృష్ణ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే బి.గోపాల్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో ఈ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ హిట్లు రావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. మరో బ్లాక్ బస్టర్ హిట్ కి సన్నాహాలు మొదలవుతున్నాయనే చెప్పుకుంటున్నారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని పేరు తెరపైకి వచ్చింది. 'క్రాక్' సినిమా చూసిన బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనిని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడనే వార్తలు షికారు చేశాయి.
ఈ మధ్యలోనే 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబుతో కూడా బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని అంటున్నారు. తాజాగా శ్రీవాస్ పేరు కూడా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. డైమండ్ రత్నబాబు రాసిన ఒక కథను వినిపించి శ్రీవాస్ ఓకే చేయించుకున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'డిక్టేటర్' వచ్చిన సంగతి తెలిసిందే. ఇక 'పైసా వసూల్' దగ్గర నుంచి పూరి జగన్నాథ్ పేరు కూడా లైన్లోనే ఉంది. ఈ జోరు చూస్తుంటే, బాలకృష్ణ కుర్రహీరోలను మించిపోతున్నట్టుగానే అనిపిస్తోంది. నిజంగానే ఈ ప్రాజెక్టులన్నీ సెట్ అయితే ఓ రెండుమూడేళ్లవరకూ బాలకృష్ణ డైరీ ఖాళీగా లేనట్టే!