• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య ప్రకటన.. ఆ...

బాలయ్య ప్రకటన.. ఆ సినిమాకు ఊపిరి

By - Tupaki Desk
Update: 2016-06-29 07:30 GMT
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి ఆయన స్థాయికి తగ్గ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఏడాదిన్నర కిందట ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ఆయన్ని తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అది గత సినిమాల కంటే బెటర్ అనిపించుకుంది కానీ.. హిట్టవ్వలేదు. ఈ మధ్యే సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ అనే సినిమా మొదలుపెట్టాడు కృష్ణవంశీ. ఐతే సందీప్ కూడా వరుస ఫెయిల్యూర్లతో అల్లాడుతున్నాడు. అతడి లేటెస్ట్ మూవీస్ రన్.. ఒక్క అమ్మాయి తప్ప రెండూ కూడా ఫ్లాపులే. దీంతో ‘నక్షత్రం’ మీదే జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఈ సినిమా విడుదల సమయానికి కూడా ఏమాత్రం హైప్ తెచ్చుకుంటుందో అన్నది అనుమానంగానే ఉంది.

ఐతే ఇలాంటి టైంలోనే నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటనతో ‘నక్షత్రం’ టీంకు ఊపొచ్చింది. తన తర్వాతి సినిమా కృష్ణవంశీతో ఉంటుందని బాలయ్య హిందూపురంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నక్షత్రం’ కంటే ముందు బాలయ్య వందో సినిమాను డైరెక్ట్ చేయాలని ఆశపడ్డాడు కృష్ణవంశీ. ఇద్దరి మధ్యా సీరియస్ గానే చర్చలు జరిగాయి. కానీ చివరికి కృష్ణవంశీకి నో చెప్పి క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మొదలుపెట్టాడు బాలయ్య. ఐతే వందో సినిమాకు కాదన్నా.. ఆ తర్వాత మాత్రం కృష్ణవంశీతోనే పని చేయబోతున్నాడు బాలయ్య. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి ప్రెస్టీజియస్ మూవీ తర్వాతి బాలయ్య లాంటి స్టార్ హీరో కృష్ణవంశీ దర్శకత్వంలో చేయబోతున్నాడంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. దాని ఎఫెక్ట్ ‘నక్షత్రం’ మీద పాజిటివ్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. విడుదలకు ముందు ఆటోమేటిగ్గా ఈ సినిమాకు హైప్ వచ్చేస్తుంది. బిజినెస్ బాగా జరగొచ్చు. జనాల్లోనూ బాగా ఆసక్తి నెలకొనవచ్చు. మొత్తానికి బాలయ్య చేసిన ప్రకటన ‘నక్షత్రం’కు వరంగా మారిందన్నమాట.
Tags:    
  • Balakrishna 
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 

Similar News

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS