ఆమె తొడలపై వేసిన ట్వీటే తీసేశాడే

Update: 2017-05-27 13:45 GMT
సెన్సేషనల్ సినిమాలు తీసే స్థాయి నుంచి ట్వీట్స్ తో మాత్రమే సంచలనాల వరకూ దిగిపోయి.. రాంగోపాల్ వర్మకు చాలా కాలమే అయింది. వోడ్కా(ఇప్పుడు మానేశానని చెబుతున్నాడులే) ఎఫెక్ట్ లో వర్మ పెట్టే ట్వీట్స్.. తెల్లారేసరికల్లా కాంట్రవర్సీ అయిపోతుంటాయి. సినిమాలు వర్కవుట్ కాకపోవడం.. సెన్సార్ ఇబ్బందులు లేకపోవడంతో ఇప్పుడు గన్స్ అండ్ థైస్ అంటూ ఓ సీరియల్ తీసేస్తున్నాడు వర్మ.

ఇప్పటికే ఈ తుపాకులు మరియు తొడలు వెబ్ సిరీస్ కి ట్రైలర్ కూడా వదిలాడు. న్యూడిటీతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. దీనికి ఆ పేరు పెట్టడం వెనక ఓ ఇద్దరి పేర్లు చెప్పాడు వర్మ. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గన్స్ వాడకం.. అలనాటి హీరోయిన్ జీనత్ అమన్ థైస్.. తన వెబ్ సిరీస్ కు ఈ టైటిల్ పెట్టడానికి కారణం అంటూ అర్ధరాత్రి ఓ ట్వీట్ పెట్టాడు వర్మ. 'బచ్చన్ గన్స్.. జీనత్ థైస్.. ఈ రెండిటి ప్రభావంతో నేను ఫిలిం మేకర్ గా మారాను' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

బిగ్ బీ తుపాకుల వాడకం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఇక 1970ల్లోనే మిస్ ఇండియా జీనత్ అమన్.. ఆ తర్వాత బాలీవుడ్ ఏలేసింది. ఎందుకో తెలీదు కానీ తెల్లారిన తర్వాత ఈ ట్వీట్ ను గభాలున తీసేశాడు వర్మ. బహుశా ఉమెన్స్ డే రోజున సన్నీ లియోన్ పై పెట్టిన ట్వీట్ తర్వాత జరిగిన గొడవ గుర్తొచ్చి ఉంటుందని నెటిజన్స్ తెగ మాట్లాడేసుకుంటున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News