• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కడ బాహుబలి...

అక్కడ బాహుబలి ప్రభంజనం..ఇక్కడ మోడీ పక్షపాతం

By - Tupaki Desk
Update: 2019-10-20 09:05 GMT
ఇండియన్ సినిమా అంటే ఏంటో ప్రపంచానికి చూపించిన చిత్రం ‘బాహుబలి’. మన జక్కన్న విజువల్ వండర్ పుణ్యమా అనే ప్రపంచ స్థాయిలో ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇండియన్ సినిమాకు ఇప్పటిదాకా దక్కని గౌరవాలెన్నో ఆ చిత్రం దక్కించుకుంది. లండన్‌ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ కు 148 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉండగా.. ఇన్నేళ్ల చరిత్రలో అక్కడ ప్రదర్శితమైన తొలి నాన్ ఇంగ్లిష్ మూవీగా కూడా మన ‘బాహుబలి’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇక్కడ జరుగుతున్న చిత్రోత్సవాల్లో భాగంగా.. పేరుమోసిన హాలీవుడ్ సినిమాలతో పాటుగా ప్రదర్శితమై భారతీయ సినిమా గౌరవాన్ని పెంచింది ‘బాహుబలి’. హాలీవుడ్ సినిమాలకు కూడాా లేని స్థాయిలో నిన్న సాయంత్రం రాయల్ ఆల్బర్ట్ హాల్‌ లో నెలకొన్న సందడి.. ఆ యుఫోరియా చూసి నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదీ సౌత్ సినిమా.. ఇంకా తెలుగు సినిమా సత్తా.

ఐతే వేరే దేశంలో మన తెలుగు సినిమాకు ఇంతటి గౌరవం దక్కుతున్న సమయంలోనే.. స్వయంగా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు సినిమాల్ని - దక్షిణాది చిత్రాల్ని కించపరిచే పని చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా స్వచ్ఛ భారత్ ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఆయన సినీ పరిశ్రమతో కలిసి పని చేసేందుకు సినీ ప్రముఖుల్ని ఆహ్వానించారు. పేరుకేమో ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీతో సమావేశం. కానీ అక్కడ ఉన్నవాళ్లందరూ బాలీవుడ్ ప్రముఖులే. ఆమిర్ ఖాన్ - షారుఖ్ ఖాన్ సహా అందరూ హిందీ ఫిలిం సెలబ్రెటీలే ఉన్నారక్కడ. ఒక్కరంటే ఒక్క దక్షిణాది సెలబ్రెటీకి కూడా ఆ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని విదేశీయులు ఒకప్పుడు అనుకునేవాళ్లు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలతో వాళ్లకు జ్ఞానోదయం అయింది. కానీ మన ప్రధానికి - ప్రభుత్వాలకే ఈ విషయం ఇంకా విషయం బోధపడకపోవడం విచారకరం.
Tags:    
  • Baahubali The Beginning 
  • Standing ovation 
  • Royal Albert Theater in London 

Similar News

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

2026-11-20 17:35 GMT

నిజమైన ప్రేమ కావాలి.. కానీ దేనికీ రాజీ పడరు!

2026-11-20 17:35 GMT

ట్రెండీ స్టోరి: నేపోకిడ్స్‌కి ప‌డి ఏడ్చేవాళ్లు ఈ 10 మందిని చూడాలి!

2026-11-20 17:33 GMT

రాత్రికిరాత్రి స్టార్ అయిపోలేదు..దాని వెనుక ఇరవై ఏళ్ల ప్రయాణం!

2026-11-20 17:31 GMT

ఈసారి అనిల్ సినిమా అంత ఈజీ కాదు!

2026-11-20 17:31 GMT

వారి ప్రేమాయ‌ణంలోనూ రొమాంటిక్ సినిమాలకు మించిన ట్విస్టులు!

2026-11-20 17:30 GMT

ఒక్క లుక్ తో నిద్ర లేకుండా చేస్తున్న నిధి అగర్వాల్!

2026-11-20 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS