ఉత్తరాంధ్ర మార్కెట్ స్టామినా అంతుందా?

Update: 2017-02-20 12:06 GMT
వైజాగ్ ఏరియా.. లేదా ఉత్తరాంధ్ర మార్కెట్.. ఇక్కడి నుంచి వసూళ్లపై ఇప్పటివరకూ ఉన్న లెక్కలు మారిపోతున్నాయి. మూడు జిల్లాల మార్కెట్‌ను కలగలిపి ఈ ఏరియాను పరిగణించడం ఆనవాయితీ. ధియేట్రికల్ రైట్స్ విక్రయం ఇలానే జరుగుతుంది.

గతంలో ఇక్కడి మార్కెట్ నుంచి ఐదారు కోట్లు వస్తే ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. సినిమాలకు మిగిలిన మార్కెట్లతో పోల్చితే, ఇక్కడ తక్కువగా డిమాండ్ ఉంటుందని టాక్. ఇక్కడ బాహుబలి 9 కోట్ల రూపాయలు వసూలు చేయడం భారీ రికార్డ్ అనుకున్నారంతా. కానీ అల్లు అర్జున్ సరైనోడు.. చాలా ఈజీగా 8 కోట్లు దాటేయడంతో.. అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఇక మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. 10 కోట్ల మార్క్ ను దాటేసి.. ఏకంగా 13 కోట్ల షేర్ రాబట్టేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది.

ఇప్పుడు బాహుబలి2 ఈ ఏరియా నుంచి 20 కోట్ల షేర్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఉత్తరాంధ్ర మార్కెట్ ఇంత విస్తారంగా పెరగడాన్ని ఫిలిం ఇండస్ట్రీ నిశితంగా గమనిస్తోంది. ఖైదీతో పాటే రిలీజ్ అయిన.. శతమానం భవతి.. గౌతమిపుత్ర శాతకర్ణిలు కూడా ఐదేసి కోట్ల షేర్ ను అధిగమించాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News