బాహుబలి చైనా.. ఇక అంతేనా?

Update: 2016-07-27 05:19 GMT
మన దేశంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి ది బిగినింగ్.. గత శుక్రవారం చైనాలో విడుదలైంది. ఇక్కడ ఎంత గొప్ప సినిమాగా నిలిచినా.. అక్కడ మాత్రం పరిస్థితి తేడాగా కనిపిస్తోంది. వసూళ్ల విషయంలో నిర్మాతలు ఎక్కువగా అంకెలు చెప్పకపోయినా.. పరిస్థితిని దాచిపెడుతున్నారనే విషయం అర్ధమవుతోంది.

బాహుబలి మొదటి మూడు రోజుల్లో చైనాలో 6,30,000డాలర్లను మాత్రమే రాబట్టగలిగింది. అమీర్ పీకే వసూలు చేసిన 19.4 మిలియన్ డాలర్లను అధిగమించడం టార్గెట్ అయినా.. అంత సీన్ కనిపించడం లేదని తెలుస్తోంది. 5వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అంటున్నా.. మొత్తం చైనాలో ఉన్న స్క్రీన్లలో 2 శాతంలో విడుదల కాలేదని.. అసలు చైనా జనాలు ఇంట్రెస్ట్ చూపలేదని అంటున్నారు.

టికెట్ రేట్లలో డిస్కౌంట్లు ప్రకటించినా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయిందట బాహుబలి. వీకెండ్స్ లో ఒక్కో స్క్రీన్ కి సగటున 12 మంది ప్రేక్షకులు మాత్రమే వచ్చారని రిపోర్టులు వస్తున్నాయి. ఇక్కడి నేటివిటీ కనెక్ట్ అయినట్లుగా.. చైనా ప్రేక్షకులను బాహుబలి ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని అనుకోవచ్చు.
Tags:    

Similar News