#PSPK మ‌రో క్రేజీ మూవీకి రంగం సిద్దం

Update: 2020-12-19 06:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చేసినా క్రేజీగా ఉంటుంది. ఫ్యాన్స్ లో అది ఎంతో ఎగ్జయిట్ మెంట్ పెంచుతుంది. అలాంటి మ‌రో ప్ర‌క‌ట‌న ఆయ‌న నుంచి వెలువ‌డనుందనేది తాజా స‌మాచారం.

పవన్ కళ్యాణ్ ఇటీవ‌లే నిహారిక వెడ్డింగ్ వేడుక‌లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిన‌దే. `వకీల్ సాబ్` చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన చిన్న‌పాటి బ్రేక్ నిచ్చి అన్నయ్య గారాల కుమార్తె వివాహం కోసం విచ్చేశారు.

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వ‌ర‌లోనే పూర్తవుతుంది. సైమ‌ల్టేనియ‌స్ గా నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి.  2021 వేస‌విలో సినిమా విడుద‌ల‌వుతుంది. కోర్ట్ డ్రామా నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

త‌దుప‌రి `అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ ‌స్క్రిప్టును ప‌వ‌న్ ఇప్ప‌టికే ఫైన‌ల్ చేశార‌ని స‌మాచారం. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ప్రయోగాత్మ‌క చి‌త్రాన్ని సోమవారం ఒక అధికారిక పూజా వేడుకతో ప్రారంభిస్తారు. రెగ్యులర్ షూట్ జనవరి 2 నుంచి హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. ఇతర ప్రధాన నటులు ఎవ‌రు అన్న‌ది ఇంకా ప్రకటించాల్సి ఉంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైలాగ్ వెర్షన్ రాశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి చివరి నాటికి సినిమాని పూర్తి చేసి విడుదల చేస్తారు.
Tags:    

Similar News