హీరో కాపురానికి విలన్ గా మారిన లిప్పులాకు!

Update: 2018-10-31 15:30 GMT
ఇప్పుడంటే మనకు టాలీవుడ్ సినిమాలో లిప్పు లాకులు కామన్ అయ్యాయి గానీ గతంలో లిప్పులాకులకు అడ్డంగా ఆకులు పువ్వులను ప్రేక్షకులకు చూపించేవారు.  ఇక బాలీవుడ్ లో లిప్పుకిస్సులకు పితామహుడు ఇమ్రాన్ హష్మి .  ఆయనను సీరియల్ కిల్లర్ సౌండింగ్ ఉండే 'సీరియల్ కిస్సర్' బిరుదుతో సత్కరించుకున్నారు బాలీవుడ్ ప్రేక్షకులు. ఇక ఇతర హీరోలు కూడా అయన బాటలో నడిచి మూతి మూద్దుల ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

లిప్పు కిస్సుల్లో ఆనందం ఎంతుందో.. అవి షూటింగ్ లో భాగంగా నలుగురి ముందు 'యాక్షన్'.. 'కట్' లకు మధ్యలో చేయడంలో ఇబ్బంది ఉంటుందో మనకు తెలియదు గానీ వాటివల్ల హీరోల ఫ్యామిలీల్లో కలతలు రేగుతున్నాయట.  బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు అలాంటి ఇబ్బందే ఎదురైందట.  'విక్కీ డోనార్' చిత్రంతో అందరినీ మెప్పించిన ఆయుష్మాన్ రీసెంట్ గా 'బధాయి హో' అనే చిత్రంలో నటించాడు.  ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక లిప్పు లాకు తన కుటుంబంలో చిచ్చు పెట్టిందని చెప్పుకొచ్చాడు.
Read more!

'విక్కీ డోనార్' లో హీరోయిన్ యామీ గౌతమ్ తో ఒక ఘాడమైన ఆధర చుంబనం ఉంది. అందులో అది చాలా సహజంగా ఉంటుంది. ఆ సీన్ ను సినిమాలో చూసిన తర్వాత ఆయుష్మాన్ భార్య తహీరా కశ్యప్ హర్ట్ అయిందట.  తర్వాత తనను వదిలేసి వెళ్ళిపోయిందట.  ఆ తర్వాత మూడేళ్ళు నానా కష్టాలు పడితే గానీ తమ దాంపత్య జీవితం కుదుట పడలేదని చెప్పుకొచ్చాడు.   కానీ ఆవిడ ఇప్పుడు కాస్త ప్రాక్టికల్ గా మారిందట. రీసెంట్ గా 'మన్మర్జియాన్' సినిమా షూటింగ్‌ లో భూమి పెడ్నేకర్‌ తో తాను లిప్‌ కిస్సు లాగిస్తుంటే  ప్రత్యక్షంగా చూసిందని చెప్పుకొచ్చాడు.  అబ్బ.. ఈ లెక్కన ఇమ్రాన్ హష్మి పరిస్థితి ఏంటో..?
Tags:    

Similar News